తిప్పర్తి : ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా.. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తెచ్చిన ధాన్యాన్ని మ్యాశ్చర్ వచ్చిన వెంటనే కాంటా వేయాలన్నారు. కొనుగోలు కేంద్రంలో తాగునీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. రైతులు ధాన్యాన్ని పొలం వద్దే ఆరబెట్టుకుని కేంద్రాలకు తెవాలన్నారు. ఆయన వెంట సివిల్ సప్లయ్ డీఎం హరిష్, డీసీఓ పాత్యానాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, తహసీల్దార్ పరుశురాములు, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఈఓ భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్


