చౌటుప్పల్ రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట గ్రామ శివారులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మండలం జాలాల్‌పూర్ గ్రామానికి చెందిన గుండ్ల యాదయ్య(68) రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో ఉంటున్న తన పెద్దకుమార్తె ఇంటికి టీవీఎస్ ఎక్సెల్‌పై వెళ్లి వస్తున్నాడు. తుఫ్రాన్‌పేట గ్రామ శివారులోని దండుమైలారం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి ఎక్కుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో యాదయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అల్లుడు మోర సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చల్లా యాదవరెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
సూర్యాపేటటౌన్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట మండల పరిధిలోని రాజనాయక్ తండా సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన పేరెల్లి అంజయ్య– మల్లమ్మల కుమారుడు సతీష్(26) సూర్యాపేట నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు
చౌటుప్పల్ రూరల్: రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం గ్రామ స్టేజి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం చెన్నపల్లికి చెందిన పొట్ట శ్రీనివాసులు, జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామానికి చెందిన వేపూరి రామస్వామి గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నివాసముంటూ పెయింటింగ్ పనులు చేస్తున్నారు. శుక్రవారం చౌటుప్పల్‌లో ఓ ఇంటికి పెయింటింగ్ వేయడానికి చౌటుప్పల్ కు బైక్‌పై వస్తున్నారు. ఖైతాపురం గ్రామ స్టేజి సమీపానికి రాగానే ఎదురుగా రాంగ్‌రూట్‌లో మరో బైక్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పొట్ట శ్రీనివాసులు, వేపూరి రామస్వామి గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చల్లా యాదవరెడ్డి తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి


