
నృసింహుడికి రాబడి ఎక్కువే..
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం శ్రీవిశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం యాదగిరి క్షేత్రంలో ఉగాది పచ్చడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు నివేదించారు. ఇక సాయంత్రం ముఖ మండపంలో శ్రీస్వామి వారి సేవను అలంకరించి మాడ వీధుల్లో ఊరేగించారు. తూర్పు రాజగోపురం ఎదుట మాడవీధిలో శ్రీస్వామి అమ్మవార్లను అధిష్టించి పంచాంగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆస్థాన సిద్ధాంతి గౌరిభట్ల సత్యనారాయణశర్మ పంచాంగాన్ని పఠించి, భక్తులకు, అధికారులకు, అర్చకులకు వినిపించారు. శ్రీ యాదగిరి నృసింహస్వామిది తుల రాశి కాగా ఈ ఏడాది శ్రీస్వామి వారికి 11 ఆదాయం, 05 వ్యయం, శ్రీలక్ష్మీ అమ్మవారిది సింహరాశి కాగా ఆదాయం 11, వ్యయం 11గా పేర్కొన్నారు. ఉగాది విశిష్టతను ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు వివరించారు. వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, అర్చకులు, పండితులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో వైభవంగా
ఉగాది వేడుకలు
స్వామి వారి ఆదాయం 11,వ్యయం 5, అమ్మవారికి ఆదాయం 11, వ్యయం 11

నృసింహుడికి రాబడి ఎక్కువే..