ప్రజా అర్జీల పరిష్కారానికి చొరవ చూపండి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్‌ఓ రామునాయక్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో రీ ఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సరైన రీతిలో ఎండార్స్ చేయకపోవడంతో పదేపదే దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు రెవెన్యూ అధికారుల సమన్వయంతో పరిష్కరించాలన్నారు. 196 మంది తమ సమస్యలపై వినతులు అందజేశారన్నారు.
వినతుల్లో కొన్ని..
● తన భర్త ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడని, మూడేళ్ల కుమారుడు ఉన్నాడని జీవనాధారం కోసం వితంతు పెన్షన్ మంజూరు చేయాలని దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామానికి చెందిన రజినీ జిల్లా కలెక్టర్‌కు వినతి అందజేశారు.
● నందికొట్కూరు మండలం మద్దిగట్ల గ్రామ పొలిమేరలో సర్వే నంబర్ 58లో తనకు 3.50 ఎకరాల భూ మి ఉందని, పూర్వపు పెద్దల నుంచి సాగు చేసుకుంటున్నామని, ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టాదారు పా సుపుస్తకం మంజూరు చేయాలని ఏబీఎం పాలెంకు చె ందిన రాజేంద్ర ప్రసాద్ కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.
● పోలియో వలన రెండు కాళ్లు చచ్చుబడి నడవలేకపోతున్నానని, తనకు వీల్ చైర్‌ను మంజూరు చేయాలని పగిడ్యాల మండలం ఎన్.ఘణపురం గ్రామానికి చెందిన శివలీల కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment