కర్నూలు(అర్బన్): జిల్లాలో చేపట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్‌షిప్ ) సర్వేను ఈ నెల 4 సాయంత్రంలోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. ఆయన సోమవారం జెడ్పీలోని తన చాంబర్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయాలను జనాభా ఆధారంగా రెండు, మూడు సచివాలయాలను కలిపి క్లస్టర్ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది రోజు వారీ హాజరును తప్పక వేయాలని, లేనిపక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్లను త్వరగా పూర్తి చేసి, వర్మీ తయారీపై దృష్టి సారించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment