623 మంది విద్యార్థులు గైర్హాజర్
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిషు పరీక్షకు 623 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 53 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 16,535 మందికి గాను 15,912 మంది విద్యార్థులు హాజరు కాగా 623 మంది విద్యా ర్థులు గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్‌స్క్వాడ్ పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ సునీత తెలిపారు.
మహానందీశ్వరుడికి రూ. 41.14 లక్షల ఆదాయం
మహానంది: మహానంది క్షేత్రంలో నిర్వహించిన బహిరంగ వేలాలు, సీల్డు టెండర్ల ద్వారా మహానందీశ్వరస్వామికి రూ. 41.14 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో పచ్చికొబ్బరి చిప్పల సేకరణ, సంప్రదాయ దుస్తుల విక్రయం, హోటళ్ల నిర్వహణ, మాన్యం భూమి కౌలుకు వేలాలు జరిగాయి. వీటన్నింటి ద్వారా ఏడాదికి రూ. 41.14 లక్షలు మేరకు ఆదాయం వచ్చినట్లు వివరించారు. కీలకమైన టోల్‌గేట్ల నిర్వహణ, పాదరక్షలను భద్రపరచుకునేందుకు లైసెన్స్ హక్కుల వేలాలు వాయిదా పడ్డాయి.
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం వద్దు
నంద్యాల: జనన, మరణ ధ్రువ పత్రాల జారీలో జాప్యం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో జనన, మరణ పత్రాల జారీపై ఇంటర్ డిపార్ట్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.బిడ్డ పుట్టిన తర్వాత 21 రోజుల వ్యవధిలోపు డెలివరీ అయిన ఆసుపత్రిలోనే మెడి కల్ ఆఫీసర్ నుంచి పుట్టిన తేదీ ధ్రువ పత్రా న్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ సెక్రటరీలతో హోమ్ డెలివరీలు, రిజిస్ట్రేషన్ నమోదులపై సమగ్ర సర్వే నిర్వహించి నమోదు చేయాలన్నారు. డీఎంహెఓ డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్ జఫరుల్లా, కమిషనర్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment