‘కొలువు’దీరిన ఆనందం
రుద్రవరం/బేతంచెర్ల: కన్న బిడ్డలు ఉన్నత ఉద్యోగాలు సాధిస్తే ఆ తల్లిదండ్రులకు పట్టరాని ఆనందం సొంతమవుతుంది. ఎస్‌ఐ ఉద్యోగాలకు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని బిడ్డలు ఇంటికి చేరుకోవడంతో సంతోషాలు వెల్లివెరిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్‌ఐలుగా నియమితులయ్యారు. రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన అంకిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కుమారుడు రేనాటి శివనాగిరెడ్డి కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో డ్రిగీ పూర్తి చేశారు. అక్కడే ఎన్‌సీసీ శిక్షణ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఎస్‌ఐ కొలువు సాధించారు. అనంతపురం పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకుని మంగళవారం ఇంటికి చేరుకున్నారు. ఖాకీ యూనిఫాం ధరించి తల్లికి సెల్యూట్ చేసి తన టోపీని ఆమె నెత్తిన పెట్టి ఆశీర్వాదం పొందారు. ఎస్‌ఐగా తిరిగి వచ్చిన బిడ్డను చూసి ఆ తల్లి మురిసిపోయింది. హారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతించింది. శివనాగిరెడ్డిని ఎస్‌ఐగా వైఎస్సార్ జిల్లాకు కేటాయించారు. గ్రామస్తులు, కుటుంబీకులు, బంధువులు అతనిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment