![రేపు కేటీఆర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష](/styles/webp/s3/article_images/2025/02/9/08mkl701-210167_mr-1739041995-0.jpg.webp?itok=h89hrljA)
రేపు కేటీఆర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
కోస్గి రూరల్/కొత్తపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలను అమలుపర్చడంలో పూర్తిగా విఫలమైందని.. రైతు రుణమాఫీ, పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతుల తరపున బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్ష చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కోస్గి, కొత్తపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 26న చంద్రవంచ గ్రామం నుంచి 4 పఽథకాలను ప్రారంభించారని, ఎంపిక చేసిన గ్రామాల్లో నేటి వరకు కూడా పథకాలు లబ్ధిదారులకు పూర్తిగా అందలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎకరం ఉన్న రైతులకు నిధులు మంజూరు చేశామని వ్యవసాయశాఖ మంత్రిచే చెప్పించినా ఇంత వరకు రైతుల ఖాతాలో జమ కాలేదని అన్నారు. అబద్దపు హమీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 10న కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో చేపట్టే రైతు నిరసన దీక్షకు కేటీఆర్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లా తాజా, మాజీ ఎమ్యెల్యేలు హాజరుకానున్నారని నియోజకవర్గ రైతులందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యకమంలో జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణ, సలీం, జనార్ధన్, వెంకట్‌నర్సింలు, కోనేరు సాయిలు,రాజశేఖర్‌రెడ్డి, సాయిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment