నారాయణపేట: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు నేటితో ముగియనుంది. జిల్లాలో ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 34,690 రాగా 32,147 ఉన్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 22,881 దరఖాస్తులు, 140 జీపీల్లో 11,809 దరఖాస్తులు, రూ.10 వేలు చెల్లించిన వెంచర్లు 403 ఉన్నాయి. ఇందులో నిషేధిత జాబితాలో మూడు మున్సిపాలిటీల్లో 3, గ్రామాల్లో 3 వెంచర్లను అధికారులు గుర్తించారు. ఈ నెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకుంటే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది దరఖాస్తుదారులకు సమాచారం ఫోన్ ద్వారా తెలియజేస్తూ ఈ 30 రోజుల్లో 4,142 దరఖాస్తులు పెమెంట్ చేయించగలిగారు. జిల్లా వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా రూ.25 కోట్లు అదాయం వస్తుందని లక్ష్యం నిర్దేశించగా.. రూ.10.16 కోట్లు ఆదాయం సమకూరింది. జిల్లా వ్యాప్తంగా 403 వెంచర్లు ఉండగా నాలుగు వెంచర్లు పూర్తి స్థాయిలో ఆమోదం పొందాయి.
నేటితో ముగియనున్న‘ఎల్‌ఆర్‌ఎస్’ రాయితీ గడువు
జిల్లాలో 34,690 దరఖాస్తుల్లో 32,147 ఆమోదం
ఆదాయ లక్ష్యం రూ.25 కోట్లు.. వచ్చింది 10.16 కోట్లు
సద్వినియోగం చేసుకోవాలి
అనధికార లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీతో చెల్లించాలి. ఒక్క రోజే మిగిలింది. జిల్లాలోని రియల్టర్లు, ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యాజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడువు పెంపుపై ఇంకా తమకు అధికారికంగా ఆదేశాలు రాలేదు.
– కిరణ్‌కుమార్, టీపీఓ, నారాయణపేట
మిగిలింది ఒక్క రోజే!
మిగిలింది ఒక్క రోజే!