
లఖీమ్‌పూర్ ఖేరి(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీ పరిధిలో 730 నంబర్ జాతీయ రహదారిపై బుధవారం బస్సు, మినీ ట్రక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దౌరాహా నుంచి లక్నోకు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఐరా వంతెన మీద ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ ఢీకొట్టింది.
ఘటనలో గాయపడిన 41 మందికి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సచేస్తున్నారు. రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలు ప్రధాని జాతీయ సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు చెరో రూ.2 లక్షల ఆర్థికసాయం అందనుంది.
Comments
Please login to add a commentAdd a comment