సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత 20 రోజులుగా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. రాజధాని బెంగళూరు నగరంలో ప్రతి నిమిషానికి సుమారు 7 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 10 మంది కరోనా బారిన పడుతున్నారు. బెంగళూరులో నిత్యం 7 నుంచి 10 వేల కేసులు వస్తున్నాయి. ప్రతి గంటకూ ఒక కరోనా మరణం నమోదవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు నాటికి రోజుకు సుమారు 200 మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
పెరుగుతున్న మరణాలు
కర్ణాటక వ్యాప్తంగా ఏప్రిల్ మొదటి వారంలో 164 కరోనా మరణాలు నమోదు కాగా, రెండో వారంలో ఆ సంఖ్య 315కు పెరిగింది. మూడో వారంలో 17వ తేదీ నాటికి 224 మంది మరణించారు. కాగా బెంగళూరులో ఈ నెల మొదటి వారంలో 99 మంది, రెండోవారంలో 215 మంది, మూడో వారంలో ఇప్పటికే 130 మందిని కోవిడ్ రక్కసి పొట్టనబెట్టుకుంది. రాష్ట్రంలో ప్రతి నిమిషానికి సుమారు 90 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. 100 మందికి పరీక్షలు చేస్తే అందులో 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది.
చదవండి:
రాత్రి కర్ఫ్యూ.. ఆదివారం ఫుల్ లాక్‌డౌన్
Coronavirus India Highlights: కసిదీరా కాటేస్తోంది
Comments
Please login to add a commentAdd a comment