ఈ నెల 22న బాలరాముడు తన దివ్యమైన దేవాలయంలో ఆసీనులు కానున్నాడు. ఆరోజు ప్రత్యేక అతిథుల సమక్షంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇది పూర్తయ్యాక అంటే 22వ తేదీ తరువాత సామాన్య భక్తులను అయోధ్యకు ఆహ్వానించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
జనవరి 22 తర్వాత వచ్చే భక్తుల వసతి, ఆహారం తదితర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు సీఎం యోగి స్వయంగా బ్లూప్రింట్‌ను సిద్ధం చేసి అధికారులకు అందించారు. ఈ మేరకు ప్రతిరోజూ 30 వేల మంది బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వసతి సౌకర్యాలను మరింతగా పెంచనున్నారు. ఇటీవల అయోధ్యకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు
జనవరి 22 తరువాత వచ్చే భక్తులకు హోటళ్లు, ధర్మశాలలు, హోమ్ స్టే, టెంట్ సిటీ, డార్మిటరీలో వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రామనగరికి వచ్చే భక్తుల విషయంలో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఇది కూడా చదవండి: ‘రామచరిత మాసన’ విక్రయాల జోరు!
Comments
Please login to add a commentAdd a comment