తిరువనంతపురం: భారత్‌లో మంకీపాక్స్ రెండో కేసు నమోదైంది. ఇటీవలే యూఏఈ నుంచి కేరళ వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య మంత్రి వీనా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం మంకీపాక్స్ సోకిన వ్యక్తికి మలప్పురంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఆ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో మంకీపాక్స్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ కాగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.మంకీపాక్స్ కొత్త వేరియెంట్ బయటపడడంతో ఆగస్టులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ అత్యవసర స్థితిగా ప్రకటించింది.
ఇదీచదవండి..50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూపు కనిపెట్టిన సైంటిస్టులు
Comments
Please login to add a commentAdd a comment