చెన్నై: సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు సభ్యులు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడం చాలా బాధాకరం. వీరితో పాటు మరణించిన వారిలో ఐదు నెలల చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
📍Salem, Tamil Nadu: A government bus traveling from Coimbatore to Salem lost control in the Ariyanur area and rammed into a bike and a tempo, resulting in a tragic accident that claimed 4 lives. Police are currently investigating the incident.pic.twitter.com/RwDAmRLc5F
— Deadly Kalesh (@Deadlykalesh) March 20, 2026


