న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,633 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1065 మంది మృత్యువాతపడగా, మొత్తం 70,626 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31,80,866 మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,62,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చదవండి : 31 లక్షలు దాటిన రికవరీలు
Comments
Please login to add a commentAdd a comment