దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్లు హాట్ టాపిక్‌గా మారాయి. అక్రమ కట్టడాల కూల్చివేతలతో ఢిల్లీలో ఆందోళనలు చేటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఆమ్ ఆద‍్మీ పార్టీ నేత ఢిల్లీ బీజేపీ చీఫ్‌కు తన ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
వివరాల ప్రకారం.. ఢిల్లీలో అక్రమ నిర్మాణాలు అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా.. ప‍్రభుత్వ భూమిని ఆక్రమించి తన ఇంటిని, కార్యాలయాన్ని నిర్మించారని ఆప్ ఆరోపించింది. ఈ క్రమంలోనే శనివారం(రేపు) ఉదయం 11 గంటలలోపు గుప్తా అక్రమ నిర్మాణాలను తొలగించకుంటే బుల్డోజర్లతో ఆయన ఇంటికి వెళ్తామని ఆప్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
ఇదిలా ఉండగా.. గురువారం ఆగ్నేయ ఢిల్లీలో కూల్చివేతలను ఆపేందుకు మదన్‌పూర్ ఖాదర్ ప్రాంతానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ప్రయత్నించడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. దేశ రాజధానిలో 63 లక్షల ఇళ్లను కూల్చివేయాలని బీజేపీ యోచిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. ఇక, బుల్డోజర్లతో ప్రజలను బెదిరించి బీజేపీ ప్రజల నుండి లక్షల రూపాయాలు వసూలు చేస్తోందని పౌర సంస్థల ఆప్ ఢిల్లీ ఇన్‌ఛార్జ్ దుర్గేష్ పాఠక్ అన్నారు.
ఇది కూడా చదవండి: దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనకు గురి చేస్తోంది.. సోనియా గాంధీ
Comments
Please login to add a commentAdd a comment