డిజిటల్‌ హెల్త్‌ కార్డులకు 60% మంది ఓకే | About 60 Percent of People Respond Positively to a Digital Health ID | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ హెల్త్‌ కార్డులకు 60% మంది ఓకే

Published Mon, Sep 7 2020 8:11 AM | Last Updated on Mon, Sep 7 2020 8:11 AM

About 60 Percent of People Respond Positively to a Digital Health ID - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ డిజిటల్‌ ఆరోగ్య మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘డిజిటల్‌ హెల్త్‌ ఐడీ’కి సుమారు 60 శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించారు. కానీ, వైద్య, ఆరోగ్య రికార్డులు కాకుండా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతపరిచేందుకు నిరాకరించారు. లోకల్‌సర్కిల్స్‌ అనే సోషల్‌ మీడియా వేదిక ఇటీవల దేశవ్యాప్తంగా 9 వేల మంది నుంచి హెల్త్‌ ఐడీకి సంబంధించిన 4 ప్రశ్నలపై చేపట్టిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఈ సర్వే వివరాలను డిజిటల్‌ హెల్త్‌ ఐడీలో పాలు పంచుకునే విభాగాలకు అందజేయనున్నట్లు లోకల్‌సర్కిల్స్‌ జనరల్‌ మేనేజర్‌ అక్షయ్‌ గుప్తా వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎన్‌డీహెచ్‌ఎం పథకాన్ని ప్రకటించారు.

చదవండి:కంగనా క్షమాపణ చెప్పాలి: శివసేన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement