మహారాష్ట్ర కూటమిపై నేపనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు(ఎన్సీపీ) అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) కలిసి పనిచేస్తుందని చెప్పారు. ఈ మేరకు అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ..మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) అగ్ర నేతలు రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీనికి మద్దతిస్తున్నట్లు కూడా తెలిపారు.
అలాగే ఎంవీఏలో సొంత పార్టీ గురించి ఆలోచించకుండా ఎలక్టివ్ మెరిట్ ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎంవీఏ నేతలు కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. ఎంవీఏ తన ఎమ్మెల్యే, ఎంపీలను ఎలా పెంచాలనే దానిపై చర్చించి కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే సందర్భంలో కూటమి ప్రాముఖ్యతను వివరిస్తూ..మహా వికాస్ అఘాడి(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ)లో ఉన్న పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేవన్నది వాస్తవమని, దీన్ని మనమందరం అంగీకరించాలని పవార్ అన్నారు.
ఏక్‌నాథ్‌్ షిండే, బీజేపీ కూటమిని ఓడించడానికి తామంతా ఏకతాటిపైకి వచ్చి పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత శివసేన ఏక్‌నాథ్ షిండే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటే..మనం కలిసి ఉండాలి, ఎలాంటి పొరపొచ్చా లేకుండా పోటీ చేయాలి. అప్పుడే మనం కచ్చితంగా ఎన్నికల్లో గెలవగలమని చెప్పారు అజిత్ పవార్. కాగా మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు 2024లో జరగనున్నాయి.
(చదవండి: మోదీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది)
Comments
Please login to add a commentAdd a comment