asembly
-
ఆ నిజాన్ని మనమందరం అంగీకరించాలి!: అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర కూటమిపై నేపనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు(ఎన్సీపీ) అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) కలిసి పనిచేస్తుందని చెప్పారు. ఈ మేరకు అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ..మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) అగ్ర నేతలు రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీనికి మద్దతిస్తున్నట్లు కూడా తెలిపారు. అలాగే ఎంవీఏలో సొంత పార్టీ గురించి ఆలోచించకుండా ఎలక్టివ్ మెరిట్ ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎంవీఏ నేతలు కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. ఎంవీఏ తన ఎమ్మెల్యే, ఎంపీలను ఎలా పెంచాలనే దానిపై చర్చించి కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే సందర్భంలో కూటమి ప్రాముఖ్యతను వివరిస్తూ..మహా వికాస్ అఘాడి(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ)లో ఉన్న పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేవన్నది వాస్తవమని, దీన్ని మనమందరం అంగీకరించాలని పవార్ అన్నారు. ఏక్నాథ్్ షిండే, బీజేపీ కూటమిని ఓడించడానికి తామంతా ఏకతాటిపైకి వచ్చి పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత శివసేన ఏక్నాథ్ షిండే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటే..మనం కలిసి ఉండాలి, ఎలాంటి పొరపొచ్చా లేకుండా పోటీ చేయాలి. అప్పుడే మనం కచ్చితంగా ఎన్నికల్లో గెలవగలమని చెప్పారు అజిత్ పవార్. కాగా మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. (చదవండి: మోదీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది) -
‘సభలో కేసీఆర్ మా నోరు నొక్కుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఈ రోజు నుంచి ఆసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్లకార్టు ప్రదర్శనతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు ఎమ్మెల్సీ రామచంద్రారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారని, కేసీఆర్‌కు దమ్ముంటే తమకు సభలో సమయం ఇవ్వాలన్నారు. ఎంఐఎంకు ఎంత సమయం ఇస్తున్నారో తమకు అంతే సమయం ఇవ్వాలన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని, డబుల్ బెడ్రూం, టీజర్లు, రైతుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతామని పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ రామచంద్రారావు మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎన్పై వాయిదా తీర్మాణం పెట్టామని, దానిపై చర్చ జరగాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పీఆర్పీ, ఐఆర్ సమస్యలపై ఉభయ సభల్లో గళవ విప్పుతామన్నారు. అంతేగాక నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డిలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ లోపలికి ప్రవేశించారు. -
అర్హులకే డబుల్ బెడ్రూం ఇళ్లు
బాన్సువాడ రూరల్: అర్హులైన నిరుపేదలకే డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన బోర్లం క్యాంపుతో పాటు గ్రామంలో డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణాల కోసం ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించారు. బోర్లం క్యాంపు లోని దుర్గమ్మ గుడి ముందు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ స్థలానికి తోడు మరో ఎకరం పట్టా స్థలం కొని ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అలాగే బోర్లంలోని అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న స్థలంలో తొలివిడతలో 30 మందికి డబుల్ ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. గ్రామస్తులు ప్రభుత్వం ఇస్తున్న నిధులతో తామే సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటామని స్పీకర్ దృష్టికి తీసుకురాగా ఆయన సమ్మతించారు. అలాగే ఆదిబసవేశ్వర మందిరం సమీపంలో బీడీ కార్మికుల కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరో ఎకరం స్థలం కొనుగోలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 5.04 లక్షలు మంజూరు చేస్తుందని, లబ్ధిదారులు తిరిగి ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కో–ఆర్డినేటర్ అంజిరెడ్డి, సర్పంచ్ సరళ, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు పుట్టి లక్ష్మి, ఉపసర్పంచ్ మంద శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మోహన్‌నాయక్, నాయకులు మహ్మద్ ఎజాస్, నార్లసురేష్, కొత్తకొండ భాస్కర్, పాతబాలకృష్ణ, బన్సీనాయక్, బోడచందర్, నెర్రె నర్సింలు, దేవేందర్‌రెడ్డి, పుట్టి లక్ష్మణ్, గోపన్‌పల్లి సాయిలు, బసప్ప, జలీల్, రాజేశ్వర్‌గౌడ్, కృష్ణ నాగభూషణం, ఎర్రోల్లబాలు, జీవన్ పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: పఢాయి కైసే హోరహీ హై.. ఆప్ సబ్ ఇస్ స్కూల్సే సంతుష్ట్ హై.. అంటూ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మండలంలోని మైనారిటీ బాలిక గురుకుల పాఠశాల విద్యార్థినులతో ముచ్చటించారు. బోర్లం నుంచి గురువారం బాన్సువాడకు వెళ్తూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా..? బోధన ఎలా సాగుతోంది..? పౌష్టికాహారం అందిస్తున్నారా..? అంటూ విద్యార్థినులతో ముచ్చటించారు. నెలలో ఎన్నిసార్లు చికెన్, ఎన్ని సార్లు మటన్ పెడ్తున్నారు. ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్ ఏం చేశారు అంటూ ఆరా తీశారు. ఎవరెవరు ఎక్కడెక్కడి వారు అంటూ పలువురిని ప్రశ్నించారు. మరోసారి తీరిగ్గా వస్తానని..చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. పఢాయి కైసే హోరహీ.. -
భగ్గుమన్న అసెంబ్లీ
భువనేశ్వర్ : జగన్నాథునిపట్ల జరుగుతున్న తప్పిదాల శీర్షికతో రాష్ట్ర శాసన సభ భగ్గుమంది. మంగళవారం ఈ విచిత్ర పరిస్థితి చోటు చేసుకుంది. రాష్ట్ర శాసన సభలో మలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం యథాతథంగా ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు స్పీకర్ ఆదేశించిన మరుక్షణమే సభలో వాతావరణం వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు భారతీయ జనతా పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకుపోయారు. ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని దేవస్థానంలో దైనందిన సేవాదుల్లో అవాంఛనీయ జాప్యం జరుగుతోంది. ఈ విచారకర పరిస్థితులు రాష్ట్రంతో పాటు ప్రప ంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న జగన్నాథ స్వామి భక్తుల హృదయాల్ని కలిచి వేస్తున్నాయని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. సభ్యులు శాంతించి సభా కార్యక్రమాలకు సహకరించాలన్న స్పీకర్ అభ్యర్థనపట్ల స్పంద న కొరవడింది. ఈ పరిస్థితుల్లో సభా కార్యక్రమాల్ని ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రదీప్ కుమార్ ఆమత్ ప్రకటించారు. దీంతో మంగళవారం నిర్వహించాల్సిన ప్రశ్నోత్తరాలకు గండి పడింది. జీరో అవర్‌లోనూ అదేపరిస్థితి ప్రశ్నోత్తరాల తర్వాత నిర్వహించాల్సిన జీరో అవర్ సమావేశాలకు సభలో అనుకూల వాతావరణం కనిపించలేదు. శ్రీ మందిరంలో సేవల్లో జాప్యం పట్ల స్పీకర్ రూలింగ్ జారీ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దానికి స్పీకర్ నిరాకరించడంతో ప్రతిపక్షాల గోలతో సభా ప్రాంగణం మార్మోగింది. సభ్యుల్ని అదుపులోకి తెచ్చే పరిస్థితి లేనందున సభా కార్యక్రమాల్ని మరోసారి వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈసారి మధ్యాహ్నం 12.50 గంటల వరకు వాయిదా వేశారు. అప్పటికీ అదే పరిస్థితి కొనసాగడంతో తిరిగి మధ్యాహ్నం 3 గంటల వరకు సభా కార్యక్రమాల్ని నిరవధికంగా వాయిదా వేశారు. అత్యంత సున్నితమైన అంశంపట్ల ప్రభుత్వ వైఖరి సంతృప్తికరంగా లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేనట్లు ప్రతిపక్షాలు తెగేసి చెప్పడంతో సభా కార్యక్రమాల్ని ముందుకు నడపడం అసాధ్యంగా భావించిన స్పీకర్ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. -
అభివృద్ధి చూసి ఓటేశారు
పాలకొల్లు సెంట్రల్ : ప్రజాశ్రేయస్సును పక్కన పెట్టి బీజేపీని ఓడించాలనే ధ్యేయంగా అన్ని పార్టీలు కలిసి పనిచేసినా అభివృద్ధిని మాత్రం ఓడించలేకపోయారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శనివారం రాష్ట్ర స్వచ్ఛభారత్ కన్వీనర్ డాక్టర్ బాబ్జీ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ తమది గాలివాటం గెలుపు కాదు వంద శాతం అభివృద్ధి విజయమని ఉత్తర్‌ప్రదేశ్ ఫలితాలు నిరూపించాయి. పార్టీ విజయం సాధిస్తుందని తెలుసు కానీ 320కి పైగా స్థానాలు గెలుచుకోవడం చూస్తుంటే ప్రధాని మోదీ పథకాలు ప్రజలపై ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుందన్నారు. త్వరలో ఏపీలోనూ బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కృషి చేస్తున్నారని చెప్పారు. అందుకోసం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నామని, ఇక్కడ కూడా విజయబావుటా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ నోట్ల రద్దుతో బీజేపీకి ప్రజాధరణ లేదని విపక్షాలు ఎన్నో ఆరోపణలు చేశారని, ప్రజాతీర్పు చూసిన తరువాత ఓటింగ్ యంత్రాల వైఫల్యమని అంటున్నారని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, క్వాయర్ బోర్డు డైరెక్టర్ పీవీఎస్ వర్మ, రావూరి సుధ, ఉన్నమట్ల కబర్ది పాల్గొన్నారు. -
అసెంబ్లీకి పాదయాత్రగా వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రవీంద్రభారతి సర్కిల్‌కు చేరుకొనున్నారు. ప్రకాశం పంతులు విగ్రహం నుంచి వారు అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈసారి ఏపీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18 రోజలపాటు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి.