ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రవీంద్రభారతి సర్కిల్‌కు చేరుకొనున్నారు. ప్రకాశం పంతులు విగ్రహం నుంచి వారు అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.
ఈసారి ఏపీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18 రోజలపాటు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి.