
పట్నా: బీహార్‌లో ఇటీవల పలువురి అకౌంట్లలో కోట్లాది రూపాయల డబ్బు జమ అవుతోంది. గురువారం ఇద్దరు విద్యార్థులు ఖాతాలో రూ. 960 కోట్లు జమ అయినట్లు వార్త వైరల్ కాగా, శుక్రవారం మరో వృద్ధుడి ఖాతాలో ఏకంగా రూ. 52 కోట్లు జమ అయినట్లు తేలింది. ఈ ఘటన ముజఫరాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
బ్యాంకులో పింఛన్ ఖాతా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం వెళ్లిన వృద్ధుడు రామ్ బహదూర్‌షా తన ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అతని అకౌంట్లో ఏకంగా రూ. 52 కోట్లు జమ అయినట్లు తెలుసుకున్నారు. అంత డబ్బు తన ఖాతాలో ఉండటం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. ఇలా అత్యధిక మొత్తం బ్యాంకులో జమ అయితే ఆయా ఖాతాలను అధికారులు నిలిపివేస్తున్నారు. తన ఖాతాలో పడిన సొమ్ము నుంచి ఎంతో కొంత తనకు అందించాలని వృద్ధుడు ప్రభుత్వాన్ని కోరాడు.
(చదవండి: Bamboo Day: వెదురు విస్తీర్ణంలో భారత్ రెండో ప్లేస్, కానీ.. ఆ చిన్నదేశాల కంటే కిందనే!)
Comments
Please login to add a commentAdd a comment