కేరళ లైంగిక దాడి కేసు : బిషప్‌కు ఎదురుదెబ్బ | Bishop Franco Mulakkals Plea Dismissed By The Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో ఆ బిషప్‌కు షాక్‌..

Published Wed, Aug 5 2020 6:20 PM | Last Updated on Wed, Aug 5 2020 8:26 PM

Bishop Franco Mulakkals Plea Dismissed By The Supreme Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లైంగిక దాడి కేసులో నిందితుడికి సర్వోన్నత న్యాయస్ధానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేరళ నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనపై లైంగిక దాడి ఆరోపణలను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. మీ పిటిషన్‌ ఏమాత్రం విచారణార్హంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసులో తనను కావాలని ఇరికించారని, తాను అమాయకుడినని..కేసు నుంచి తనను తప్పించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో బిషప్‌ ములక్కల్‌ పేర్కొన్నారు.

కాగా ములక్కల్‌ అభ్యర్ధనను అంతకుముందు కేరళ హైకోర్టుతో పాటు, ప్రత్యేక న్యాయస్ధానం కూడా తోసిపుచ్చి విచారణను ఎదుర్కోవాలని ఆదేశించాయి. ఇక 2014 నుంచి 2016 మధ్య బిషప్‌ ములక్కల్‌ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని 2018 జూన్‌లో నన్‌ (43) ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ములక్కల్‌ను పలుమార్లు ప్రశ్నించిన కేరళ పోలీసులు 2018 సెప్టెంబర్‌లో ఆయనను అరెస్ట్‌ చేశారు. 40 రోజుల అనంతరం ములక్కల్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగుచూడటంతో జలంధర్‌ బిషప్‌గా ములక్కల్‌ను తొలగించారు. ఆయనపై సిట్‌ చార్జిషీట్‌ను దాఖలు చేసింది.

చదవండి : లైంగికదాడి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement