
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల్లోని 10 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు రానున్నాయి. మార్చి 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.
అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. మార్చి 29తో 10మంది ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీల జాబితాలో కృష్ణారెడ్డి, వి. గంగాధర్ గౌడ్, కూర్మయ్యగారి నవీన్ కుమార్ ఉన్నారు. ఇక ఏపీలో పదవీకాలం ముగుస్తున్నవారి జాబితాలో నారా లోకేశ్, చల్లా భగీరథ్ రెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పీవీవీ సూర్యనారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment