
ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిసాయి. ఇప్పటి వరకు 11 సార్లు కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలు జరిగినప్పటికీ చర్చలు మాత్రం కొలిక్కిరాలేదు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు భీష్మించుకు కుర్చోగా, కేంద్రం మాత్రం చర్చలు జరిగిన ప్రతిసారి కొత్త ప్రతిపాదనలతో ముందుకొస్తోంది.
తాజాగా రెండేళ్ల పాటు చట్టాలను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించడంతో కొత్త ప్రతిపాదనలేమీ ఉండబోవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రైతు సంఘాలతో చర్చలకు దాదాపుగా బ్రేక్ పడినట్లైంది. రైతులు మాత్రం చట్టాలు రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించేంత వరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment