22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపధ్యంలో దేశమంతటా రామనామం మారుమోగిపోతోంది. ఇదే సమయంలో రామాలయానికి యూపీ ప్రభుత్వం ఇచ్చిన విరాళంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రభుత్వ విరాళాలకు సంబంధించి ఒక వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో యోగి ఆదిత్యనాథ్.. ‘కరసేవకులు ఎన్నో త్యాగాలు చేశారు. దీనికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మార్గదర్శకత్వం, విశ్వ హిందూ పరిషత్ నాయకత్వం, సాధువుల నుండి ఆశీర్వాదాలు తోడుగా నిలిచాయి. కరసేవకుల ఉద్యమం కారణంగానే రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం జరుగుతోంది. దీనికి యూపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు అందించలేదు. నిర్మాణం కోసం వెచ్చిస్తున్న సొమ్ము దేశంతో పాటు ప్రపంచం నలుమూలల ఉన్న రామభక్తులు అందించారు’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి?
అయితే యూపీ ప్రభుత్వం ఏయే పనులకు నిధులు వెచ్చిస్తున్నదో సీఎం యోగి తెలిపారు. రామ మందిరం వెలుపల రైల్వే స్టేషన్, విమానాశ్రయ నిర్మాణం, గెస్ట్ హౌస్ నిర్మాణం, క్రూయిజ్ సర్వీస్, రోడ్డు విస్తరణ, పార్కింగ్ సౌకర్యాల కోసం ప్రభుత్వం నిధులు అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ పనులన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు.
దేశం నలుమూలల నుండి రామాలయానికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఆలయానికి కానుకలు కూడా భారీగానే వస్తున్నాయి. రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు విరాళంగా భక్తులు అందజేస్తున్నారు. నెల మొత్తం మీద చూసుకుంటే రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకూ నిధులు అందుతున్నాయి. అయితే ఆన్‌లైన్ విరాళాల విరాళాల లెక్కింపు ఇంకా జరగలేదని సమాచారం.
एक पाई सरकार ने नहीं दी है, न केंद्र की सरकार ने, न राज्य की सरकार ने, मंदिर के किसी काम में नहीं!
— Yogi Adityanath (@myogiadityanath) January 17, 2024
ये सारा पैसा रामभक्तों ने देश भर से दिया है, दुनिया भर से दिया है... pic.twitter.com/m6DOFSdI4t
Comments
Please login to add a commentAdd a comment