సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొలీజియం అంటే సెర్చ్ కమిటీ కాదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. సుప్రీంకోర్టులో, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి అర్హుల పేర్లను సిఫార్సు చేసే కొలీజియంపై కీలక వ్యాఖ్యలు చేసింది. దానికి సెర్చ్ కమిటీ హోదా మాత్రమే ఉంటుందని వెల్లడించింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను కేంద్రంతప్పనిసరిగా ఆమోదించాల్సిందేనని స్పష్టంచేసింది.
కొలీజియం సిఫార్సుల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న పేర్ల జాబితాను విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. వాటి ఆమోదానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని పేర్కొంది. కొలీజియం సిఫార్సులను నోటిఫై చేయడానికి కేంద్రానికి స్పష్టమైన గడువు నిర్దేశించాలంటూ హర్ష సింఘాల్ అనే లాయర్ పిల్ దాఖలు చేశారు. జార్ఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావును నియమించాలన్న కొలీజియం సిఫార్సును కేంద్రం పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది.
వీటిపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫా ర్సుల ఆమోదంపై కేంద్రానికి కాలావధి నిర్దేశించాలని పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఆలోగా స్పందించకపోతే వాటిని ఆమోదించినట్లుగానే భావించేలా నిబంధన తీసుకురావాలని చెప్పారు. «కొలీజియం రెండోసారి సిఫార్సుల్లో పెండింగ్‌లో ఉన్నవాటి వివరాలివ్వాలని అటార్నీ జనరల్‌ను దర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment