Collegium Recommends AP HC CJ PK Mishra To Be SC Judge - Sakshi
Sakshi News home page

కొలీజియం ప్రమోషన్ లిస్టులో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్

Published Tue, May 16 2023 5:58 PM | Last Updated on Tue, May 16 2023 6:42 PM

Collegium Recommends AP HC CJ PK Mishra To Be SC Judge - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం ప్రమోషన్‌ లిస్టులో ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీకే మిశ్రాతో పాటు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది.  కొలిజియం తీర్మానం ఈ విధంగా ఉంది. 

    "After carefully evaluating the merit, integrity and competence of eligible Chief Justices and senior puisne Judges of the High Courts and also accommodating a plurality of considerations, the Collegium finds Justice Prashant Kumar Mishra, Chief Justice, Andhra Pradesh High Court to be more deserving and suitable in all respects for being appointed as a Judge of the Supreme Court of India,  Justice Prashant Kumar Mishra has served as a judge of the High Court for over thirteen years and ranks at serial number 21 in the All-India Seniority List of judges of the High Courts," it said.

వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంటుంది.  సాధారణంగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను న్యాయ శాఖ ఆమోదిస్తూ ఉంటుంది.

సుప్రీంకోర్టులో మొత్తం ఉండాల్సిన జడ్జీలు 34. ప్రస్తుతం రెండు ఖాళీలుండగా, 32 మంది జడ్జిలున్నారు. రెండు రోజుల కిందటే జస్టిస్ దినేష్ మహేశ్వరీ, జస్టిస్ MR షా పదవీ విరమణ చేశారు. ఇక అతి త్వరలో మరో నలుగురు జడ్జిలు కూడా రిటైర్ కానున్నారు. 

జస్టిస్ KM జోసెఫ్ జూన్ 16, 2023
జస్టిస్ అజయ్ రస్తోగి జూన్ 17, 2023
జస్టిస్ V రామసుబ్రమణియన్ జూన్ 29, 2023
జస్టిస్ కృష్ణ మురారి జులై 8, 2023

ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే మొత్తం ఆరు ఖాళీలు ఏర్పడతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement