prasanth kumar misra
-
కొలీజియం ప్రమోషన్ లిస్టులో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం ప్రమోషన్ లిస్టులో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీకే మిశ్రాతో పాటు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. కొలిజియం తీర్మానం ఈ విధంగా ఉంది. "After carefully evaluating the merit, integrity and competence of eligible Chief Justices and senior puisne Judges of the High Courts and also accommodating a plurality of considerations, the Collegium finds Justice Prashant Kumar Mishra, Chief Justice, Andhra Pradesh High Court to be more deserving and suitable in all respects for being appointed as a Judge of the Supreme Court of India, Justice Prashant Kumar Mishra has served as a judge of the High Court for over thirteen years and ranks at serial number 21 in the All-India Seniority List of judges of the High Courts," it said. Supreme Court Collegium recommends Andhra Pradesh High Court Chief Justice Prashant Kumar Mishra and Senior Advocate KV Viswanathan to be elevated as judges of the apex court. — ANI (@ANI) May 16, 2023 వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంటుంది. సాధారణంగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను న్యాయ శాఖ ఆమోదిస్తూ ఉంటుంది. [BREAKING] Collegium recommends elevation of Andhra Pradesh High Court Chief Justice Prashant Kumar Mishra to Supreme Court#SupremeCourtOfIndia #SupremeCourt https://t.co/ITP3WENyZ7 — Bar & Bench (@barandbench) May 16, 2023 సుప్రీంకోర్టులో మొత్తం ఉండాల్సిన జడ్జీలు 34. ప్రస్తుతం రెండు ఖాళీలుండగా, 32 మంది జడ్జిలున్నారు. రెండు రోజుల కిందటే జస్టిస్ దినేష్ మహేశ్వరీ, జస్టిస్ MR షా పదవీ విరమణ చేశారు. ఇక అతి త్వరలో మరో నలుగురు జడ్జిలు కూడా రిటైర్ కానున్నారు. జస్టిస్ KM జోసెఫ్ జూన్ 16, 2023 జస్టిస్ అజయ్ రస్తోగి జూన్ 17, 2023 జస్టిస్ V రామసుబ్రమణియన్ జూన్ 29, 2023 జస్టిస్ కృష్ణ మురారి జులై 8, 2023 ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే మొత్తం ఆరు ఖాళీలు ఏర్పడతాయి. -
జీవోనెం.1పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం వాదనలు పూర్తికావడంతో.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఇక జీవో నెంబర్ 1 పై సస్పెన్షన్‌ను కొనసాగించాలని టీడీపీ తరపు న్యాయవాది.. హైకోర్ట్ బెంచ్‌ను కోరారు. అయితే అందుకు ధర్మాసనం నిరాకరించింది. అంతకు ముందు రోజు వాదనల సందర్భంగా.. చీఫ్ జస్టిస్, వెకేషన్ బెంచ్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే.. రోడ్‌షోల మీద, ర్యాలీల మీద సర్కార్ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పిందని, ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు సీజే గుర్తు చేశారు. అలాగే.. చంద్రబాబు సభల్లో 8 మంది చనిపోయిన దృష్ట్యా సర్కారు జీవో తెచ్చిందని ప్రస్తావించారు. -
ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ చోరీ
తిరువొత్తియూరు: ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ చోరీ చేసి రూ. 10 వేలకు విక్రయించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఐఏఎస్ అధికారి. ఇతను శిక్షణకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో చెన్నైకి వచ్చారు. చేపాక్కం గెస్ట్‌హౌస్‌లో ఉంటున్నారు. గత 2వ తేదీ రాత్రి 10.30 గంటలకు మద్రాసు యూనివర్సిటీ వద్ద వాలాజా రోడ్డులో వాకింగ్ చేస్తున్న సమయంలో బైకులో వచ్చిన ఓ వ్యక్తి ఐఏఎస్ అధికారి సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయాడు. నేరస్తున్ని పట్టుకుని అరెస్టు చేయూలని పోలీసులకు కమిషనర్ జార్జి ఆదేశాలు జారీ చేశారు. సహాయ కమిషనర్ పీర్ మహ్మద్ నేతృత్వంలో అన్నా సమాధి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శివానందం కేసు నమోదు చేసి విచారణ చేపట్టా రు. పోలీసుల విచారణలో ప్రశాంత్‌కుమార్ మిశ్రా సెల్‌ఫోన్‌ను దుండగుడు రూ . 10వేలకు బర్మాబజార్‌లో విక్రయించినట్టు తెలిసింది. దీంతో ఈ సెల్‌ఫోన్‌ను విక్రయిం చిన ప్యారిస్‌కు చెందిన పీర్ హనీఫ్ (21) అనే యువకుడిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.