ఇండియన్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్‌కి వేధింపుల కేసులో సుప్రీం కోర్టు భారీ ఊరట ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్‌పై అదే పార్టీ మాజీ సభ్యురాలు తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో శ్రీనివాస్‌కి అరెస్టు కాకుండా తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ మేరకు కోర్టులో శ్రీనివాస్ తరుఫు న్యాయవాది అభిషేక్ సంఘ్వీ సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేయడానికి ముందే సదరు మహిళ ట్విట్టర్‌లో వివక్ష ఆరోపణలు లేవనెత్తారని చెప్పారు.
ఇచ్చిన పలు మీడియా ఇంటర్వ్యూల్లో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు లేవని సింఘ్వీ తెలిపారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం శ్రీనివాస్‌కు అనుకూలంగా ఈ విధంగా తీర్పుని వెలువరించింది. ఇదిలా ఉండగా బాధితురాలి తరుఫు ప్రభుత్వ న్యాయవాది సోలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు తీయ మహిళ కమిషన్ జారీ చేసిన నోటీసుకు కూడా స్పందించలేదని తెలిపారు. దీంతో జస్టిస్ గవాయ్ ఈ కేసులో సీబీఐ, ఈడీ ఎంటర్ అవ్వలేదా అని ప్రశ్నించారు. దీనికి ఫిర్యాదుదారురాలి తరుఫు న్యాయవాది ప్రతిస్పందనగా ఇరువురు ఒకే పార్టీకి చెందిన వారు కాబట్టి ఈ కేసును రాజకీయ పరంగా కూడా చూడలేమని చెప్పారు. అతనికి మరోసారి తాము నోటీసు ఇచ్చామని చెప్పారు.
ఐతే అతను అతను అనారోగ్యంతో ఉన్నానంటూ సాకులతో తప్పించుకుంటున్నాడని చెప్పారు రాజు. ఇలా ప్రతిసారి నోటీసును ధిక్కరిస్తూ వచ్చాడని చెప్పారు. అదీగాక గౌహతి హైకోర్టు కూడా ఈ కేసులో ముందస్తు అరెస్టు బెయిల్ అర్హత లేదని పేర్కొంది. అయితే శ్రీనివాస్ తరుఫు న్యాయవాది మాత్రం శ్రీనివాస్‌పై వచ్చిన అభియోగాలన్నీ భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్‌ల కింద ఉన్నాయని, ఒక్క సెక్షన్ మినహా మిగిలిన వాటికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదించారు. కాగా, యువజన కాంగ్రెస్ మహిళా సభ్యురాలు శ్రీనివాస్ గత ఆరు నెలలుగా తనను వేధిస్తున్నాడని, పరుష పదజాలంతో మాట్లాడుతున్నాడని దిస్పూర్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాదు తాను పార్టీ ఆఫీసర్ బేరర్లులోని సీనియర్లకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment