న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం చూపిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశంలో కరోనా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఇక దేశంలో రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటేసింది. గత 24 గంటల్లో కొత్తగా 1,03,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఆదివారం వైరస్ బారినపడి 478 మంది ప్రాణాలు విడిచారు.
కాగా ఇప్పటి వరకు 1,25,89,067 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం 1,65,101 మంది మరణించారు. కొత్తగా 52,847 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కరోనాను జయించిన వారి సంఖ్య1,16,82,136కి చేరింది. దేశ వ్యాప్తంగా 7,41,830 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 కోట్ల 91 లక్షల మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,097 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఆరుగురు మృతిచెందారు. దీంతో తెలంగాణలో మొత్తం మొత్తం 3,13,237కి చేరింంది. ఇప్పటివరకు 3,02,768 మంది డిశ్చార్జ్ అ‍్యయారు. 1,723 మంది మృతి. ప్రస్తుతం 8,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 302 కరోనా కేసులు వెలుగుచూడగా, మేడ్చల్ 138, రంగారెడ్డిలో 116 కరోనా కేసులు నమోదయ్యాయి.
చదవండి: మహారాష్ట్రలో మినీ లాక్‌డౌన్
Comments
Please login to add a commentAdd a comment