సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది కరోనా వైరస్ మొదలై తగ్గింది. కానీ ఈ సంవత్సరం సెకండ్ వేవ్ అల్లకల్లోం చేసింది. ఇక మూడో వేవ్ కూడా పొంచి ఉందని అంతర్జాతీయ సంస్థలతో పాటు పలువురు వైద్య పరిశోధన సంస్థలు, ప్రముఖులు హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడో వేవ్‌కు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సలహాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మూడో వేవ్‌పై కీలక నిర్ణయాలు తెలిపారు.
మూడో వేవ్ ఉప్పెన పొంచి ఉన్న నేపథ్యంలో తాము మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాన దృష్టి సారించినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ‘మనం మూడో దశకు సంసిద్ధం కావాలి. ప్రస్తుతం 20 వేల కేసులను తట్టుకునేలా ఢిల్లీలో సదుపాయాలు కల్పించాం. మూడో దశలో రోజుకు 30 వేల కేసులు తట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆక్సిజన్ బెడ్లు పెంచుతున్నాం’ అని సీఎం తెలిపారు.. ఢిల్లీలో ప్రస్తుతం నాలుగో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా సోమవారం 12,651 కేసులు నిర్ధారణ కాగా, 319 మంది మృతి చెందారు.
చదవండి: రేపు కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై తేల్చనున్న సీఎం కేసీఆర్
చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ
Comments
Please login to add a commentAdd a comment