సాక్షి, ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కేసులో కేజ్రీవాల్ నేడు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించినా ఏడుసారి కూడా ఆయన హాజరుకాలేదు.
వివరాల ప్రకారం.. లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఏడోసారి జారీ చేసిన సమన్లను కూడా కేజ్రీవాల్ పట్టించుకోలేదు. నేడు విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ..‘ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేసింది. ఈడీ చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని సూచించింది. కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని కోరింది. ముఖ్యమంత్రికి పలుమార్లు సమన్లు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ మార్చి 16న జరగనుంది. రోజువారీ సమన్లు పంపే బదులు ఈడీ ఓపిక పట్టాలి. కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలి. మేం ఇండియా కూటమిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మోదీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదు’ అని పేర్కొంది.
Delhi CM and AAP National Convenor Arvind Kejriwal will not go to ED today. The matter is in the court and the next hearing is on March 16. Instead of sending summons daily, the ED should wait for the court's decision. We will not leave the INDIA alliance. Modi government should…
— ANI (@ANI) February 26, 2024
ఇదిలా ఉండగా.. ఈడీ ఇప్పటి వరకు ఏడుసార్లు కేజ్రీవాల్‌కు సమన్లు పంపించింది. ఇటీవల ఫిబ్రవరి 22వ తేదీన, గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపింది. అయితే, అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. పైగా ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment