
చెన్నై: ఎన్నికల ప్రచారంలో విషాదం నెలకొంది. పోటీలో ఉన్న మహిళా అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి 19వ తేదీన జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తంజావూరులో అయ్యంపేటై 9వ వార్డుకు అధికార డీఎంకే పార్టీ తరఫున అభ్యర్థిగా డీఎం అనసూయ బరిలో నిలిచారు.
ఇదిలా ఉండగా గురువారం అనసూయ తంజావూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో డీఎంకే నేతలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎన్నికల ప‍్రచారానికి గురువారం చివరి రోజు కాగా.. ఫిబ్రవరి 22న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment