వీడియో దృశ్యాలు
జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నది మనుషులకే కాదు కొన్ని కొన్ని సార్లు జంతువులకు కూడా వర్తిస్తుంటుంది. అందుకే వింత చేష్టలతో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాయవి. తాజాగా ఓ కుక్క చేసిన పని నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాది చంద్రో తోమర్ అనే ట్విటర్ ఖాతాదారుడు శనివారం పోస్ట్ చేసిన ఓ వీడియోలోని కుక్క, బర్రెను వాహనంగా చేసుకుని సవారీ చేయటం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. బర్రెలు, ఆవుల గుంపులో ముందుగా నడుచుకుంటూ వస్తున్న బర్రెపై కూర్చున్న ఆ శునకం రాజం! ముందు, కుడి, ఎడమ వైపుల మరో మూడు కుక్కలు బాడీ గార్డుల్లా.. చుట్టూ ఉన్న మిగిలిన బర్రెలు, ఆవులు రక్షణ కవచాల్లా దానితోపాటు ముందుకు నడుస్తూ వచ్చాయి. ( పిల్లిని పెంచుకుంటే ఎన్ని లాభాలో!..)
బర్రెమీద ఉన్న అది తననో రాజు అనుకుందో ఏమో కిందకు దిగలేదు. నేలపై, చుట్టు ప్రక్కల ఉన్న వారిని చూసుకుంటూ ముందుకు కదిలిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో వ్యూస్, రీట్వీట్స్, వందల సంఖ్యలో కామెంట్లు సంపాదించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment