రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఫ్రేమ్‌వర్క్‌: కేంద్ర మంత్రి | Driverless Cars Will Never Come in Indian Market | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఫ్రేమ్‌వర్క్‌: కేంద్ర మంత్రి

Published Mon, Dec 18 2023 1:53 PM | Last Updated on Mon, Dec 18 2023 2:50 PM

Driverless Cars Will Never Come in Indian Market - Sakshi

డ్రైవర్ల ఉద్యోగాలను కాపాడే దృష్టితో డ్రైవర్‌ లెన్‌ కార్లను భారత్‌లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఐఐఎం నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్డు భద్రతా సమస్యలపై గురించి మాట్లాడుతూ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చడం, రోడ్లపై బ్లాక్ స్పాట్‌లను తొలగించడం లాంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామన్నారు.

ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా ఆయన అభివర్ణించారు. కాగా ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో గడ్కరీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై మూలధన వ్యయం 2013-14లో  రూ. 51 వేల కోట్లు ఉండగా, అది 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,40 వేల కోట్లకు పెరిగిందన్నారు. రోడ్డు,రవాణా మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2013-14లో రూ.31,130 కోట్లు ఉండగా, 2023-24 నాటికి ఇది రూ. 2,70,435 కోట్లకు పెరిగిందని తెలిపారు. 
ఇది కూడా చదవండి: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement