driver less car
-
స్టీరింగ్ పట్టిన యంత్రుడు!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో అద్భుతాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎద్దుల బండితో మొదలైన మనిషి ప్రయాణం.. నేడు విమానంలో ప్రయాణించే స్థాయికి చేరింది. ఇది సరే అనుకునే లోపల.. అసలు మనిషే అవసరం లేకుండా కారు డ్రైవ్ చేస్తున్న సంఘటనలు నేడు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందులో భాగంగానే జపాన్ పరిశోధకులు ముసాషి అనే హ్యూమనాయిడ్ రోబోట్ సృష్టించారు.ముసాషి రోబోట్ ఎలక్ట్రిక్ మైక్రో-కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ఒక వీడియో కూడా జేఎస్కే టెండన్ గ్రూప్ తమ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. వీడియోలో గమనించినట్లయితే.. రోబోట్ రోడ్డుపై పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేయడం చూడవచ్చు.రోబోట్ డ్రైవింగ్ చేసే మైక్రో కారులో కూడా విజన్ కెమెరాలు, జీపీఎస్, కాంప్లెక్స్ అల్గారిథమ్‌లు అండ్ కంట్రోల్ సిస్టం అనే టెక్నాలజీలు ఇన్స్టాల్ చేశారు. ఇవన్నీ రోడ్డు మీద సురక్షితంగా డ్రైవ్ చేయడానికి ఉపయోగపడతాయి. డ్రైవర్‌గా మనిషి అవసరం లేకుండా కారును డ్రైవ్ చేసే టెక్నాలజీని కనిపెట్టడంలో భాగంగానే ముసాషిని రూపొందించారు.ముసాషి అనేది "మస్క్యులోస్కెలెటల్ హ్యూమనాయిడ్". దీనిని 2019లో పరిశోధనా బృందం తయారు చేసింది. ఇది మనిషిలాంటి ప్రతి రూపం పొందటమే కాకుండా.. ఇది మానవ శరీరం మాదిరిగా ఉండే కండర నిర్మాణాన్ని కలిగి ఉంది. దీనిని పరిశోధకులు ఇప్పటికే పలు విధాలుగా టెస్ట్ చేశారు.ముసాషి కన్ను హై రిజల్యూషన్ కెమరా మాదిరిగా పనిచేస్తుంది. కాబట్టి దూరంగా ఉన్న వస్తువులను, మనుషులను ఇది సులభంగా గుర్తిస్తుంది. నేరుగా ఉన్న వాటిని మాత్రమే కాకుండా సైడ్ మిర్రర్ ద్వారా వెనుక వున్నవారిని కూడా చూడగలదు. ఇది హ్యాండ్ బ్రేక్ లాగడం, స్టీరింగ్ తిప్పడం, బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ వంటి వాటిని ఆఫర్స్ చేయడం కూడా చేస్తుంది. ఇవన్నీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తాయి.ఇక్కడ కనిపించే కారును టయోటా కంపెనీ 2012లో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు పేరు 'ఛోట్టో ఒడెకేకే మచిమేడ్ సూయిసుయ్' (COMS). ఇది సింగిల్ సీట్ ఎలక్ట్రిక్ కారు. ఈ కారును రోబోట్ డ్రైవ్ చేయడానికి అనుకూలంగా రూపొందించారు. టెస్ట్ డ్రైవ్ మాత్రం టోక్యో యూనివర్సిటీలోని కాశివా క్యాంపస్‌లో నిర్వహించినట్లు తెలుస్తోంది.టెస్టింగ్ సమయంలో ముసాషి మనిషిని గుర్తించడం, కారు రావడాన్ని గమనించడం, ట్రాఫిక్ లైట్లకు రెస్పాండ్ అవ్వడం వంటివి చూడవచ్చు. అన్ని టెస్టులలోనూ రోబోట్ ఉత్తమ పెర్ఫామెన్స్ చూపించినప్పటికీ.. హ్యుమానాయిడ్ ఆటోమాటిక్ డ్రైవింగ్ అనేది ప్రారంభ దశలోనే ఉంది. కాబట్టి ముసాషిను మరింత వేగంగా ఉండేలా రూపొందించాల్సిన చేయాల్సిన అవసరం ఉంది.హ్యూమనాయిడ్ రోబోట్స్ డ్రైవింగ్ వల్ల ఉపయోగాలురోడ్డు ప్రమాదాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదానికి కారణాలు మితిమీరిన వేగం కావొచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కావొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కావొచ్చు. అయితే ఒక రోబోట్ డ్రైవర్ అవ్వడం వల్ల అది తప్పకుండా రూల్స్ ఫాలో అవుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ కూడా. ఇలాంటి రోబోలు ఎప్పుడు వినియోగంలోకి వస్తాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఫ్రేమ్‌వర్క్: కేంద్ర మంత్రి
డ్రైవర్ల ఉద్యోగాలను కాపాడే దృష్టితో డ్రైవర్ లెన్ కార్లను భారత్‌లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఐఐఎం నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్డు భద్రతా సమస్యలపై గురించి మాట్లాడుతూ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చడం, రోడ్లపై బ్లాక్ స్పాట్లను తొలగించడం లాంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామన్నారు. ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా ఆయన అభివర్ణించారు. కాగా ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో గడ్కరీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై మూలధన వ్యయం 2013-14లో రూ. 51 వేల కోట్లు ఉండగా, అది 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,40 వేల కోట్లకు పెరిగిందన్నారు. రోడ్డు,రవాణా మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2013-14లో రూ.31,130 కోట్లు ఉండగా, 2023-24 నాటికి ఇది రూ. 2,70,435 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇది కూడా చదవండి: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి! -
డ్రైవర్ లేని రోబో ట్యాక్సీ
బీజింగ్: డ్రైవర్ అవసరం లేని ఎలక్ట్రిక్ రోబో ట్యాక్సీలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయా? అవుననే చెబుతోంది చైనా దిగ్గజ టెక్నాలజీ సంస్థ బైడూ. ‘అపోలో ఆర్టీ6’ పేరుతో సెల్ఫ్–డ్రైవింగ్ ట్యాక్సీని బైడూ ఆవిష్కరించింది. ఇది ‘అపోలో గో’ యాప్ ఆధారంగా పనిచేస్తుందని చెబుతోంది. తనంతట తానే నడుపుకొనే ఈ ట్యాక్సీ తయారీకి అయిన ఖర్చు రూ.29,54,635 (37 వేల డాలర్లు). ఇందులో స్టీరింగ్ చక్రం ఉండదు. అంటే వాహనం మరింత విశాలంగా మారుతుంది. ప్రయాణికులకు అదనపు స్థలం లభిస్తుంది. డ్రైవింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి వాహనాన్ని ఎలా నడిపిస్తోడో అదే తరహాలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ నడుస్తుందని బైడూ వెల్లడించింది. ఇందులో 38 రకాల సెన్సార్లు ఉంటాయి. యాప్ నుంచి అందే ఆదేశాల మేరకు నడుచుకుంటుంది. 2023 నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని బైడూ చెబుతోంది. కనీసం లక్ష క్యాబ్‌లను తీసుకొస్తామని అంటోంది. రోబో ట్యాక్సీ తయారీ గూగుల్‌కు చైనా ఇచ్చిన సమాధానమని బైడూ సీనియర్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. చైనాలో అపోలో గో యాప్‌ను ఇప్పటికే చాలామంది వాడుతున్నారు. ‘అపోలో ఆర్టీ6’లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. డోర్లను చేత్తో తెరవాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ కనెక్షన్ లేదా యాప్ ద్వారా తెరవొచ్చు. చుట్టుపక్కల పరిసరాలను అనుక్షణం గమనించడానికి సెల్ఫ్–డ్రైవింగ్ కార్లలో 2డీ కెమెరాలు, డెప్త్–సెన్సింగ్ లైట్ డిటెక్షన్, రేంజింగ్(లిడార్) యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఎదురుగా వచ్చే మనుషులు, సిగ్నళ్లు, ప్రమాదాలను కచ్చితంగా గుర్తించడానికి కృత్రిమ మేధ టెక్నాలజీని ఉపయోగిస్తారు. భవిష్యత్తులో సాధారణ ట్యాక్సీ ధరలో సగం ధరకే రోబో ట్యాక్సీని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బైడూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్ లీ చెప్పారు. 2025 నాటికి 65 నగరాల్లో, 2030 నాటికి 100 నగరాల్లో రోబో ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని బైడూ యోచిస్తోంది. సెర్చ్ ఇంజిన్, ఆన్లైన్ ప్రకటన సేవల్లో పేరుగాంచిన బైడూ సంస్థ ఇటీవలి కాలంలో సెల్ఫ్–డ్రైవింగ్ వాహనాలు, కృత్రిమ మేధ సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెరికాలో గూగుల్ అనుబంధ సంస్థ అల్ఫాబెట్స్ వేమో 2020లో అరిజోనాలో డ్రైవర్‌లెస్ ట్యాక్సీ సర్వీసులను ఆవిష్కరించింది. -
Tesla: ఆటోపైలట్ యాక్సిడెంట్లు... మొదలైన విచారణ
డ్రైవర్ లేకుండా కారు తీసుకొస్తామంటూ ఓ వైపు టెస్లా చెబుతుంటే మరోవైపు ఇప్పటికే టెస్లా కార్లలో ఉన్న ఆటోపైలట్ పనితీరుపై విచారణ మొదలైంది. ఇప్పటి వరకు టెస్లా కార్ల వల్ల జరిగిన ప్రమాదాలు ఎన్ని, జరిగిన నష్టం ఎంత అనే అంశాలపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఆటోపైలట్‌పై విచారణ టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌మస్క్ డ్రైవర్ లేకుండా నడిచే కారును తీసుకొస్తామమంటూ తరచుగా ప్రకటనలు గుప్పిస్తున్నాడు. దీంతో డ్రైవర్ లెస్ కారు, ఆటోపైటల్ టెక్నాలజీపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ బేస్డ్ డ్రైవర్ లెస్ కారుపై ఎలన్‌మస్క్ రోజుకో అప్డేట్ బయటకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్లా కార్లలో అందుబాటులో ఉన్న ఆటోపైలట్‌పై అమెరికాకు చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ విచారణ ప్రారంభించింది. ఒకరి మరణం అమెరికాలో 2014 నుంచి ఇప్పటి వరకు టెస్లా అమ్మకాలు జరిపిన 7.65 లక్షల కార్లకు సంబంధించిన డేటాను క్రోడీకరించారు. దీని కోసం 2018 నుంచి ఇప్పటి వరకు కాలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మాసాచుసెట్స్, మియామీ, శాన్డియాగోలలో జరిగిన ప్రమాదాల్లో మొత్తం 17 గాయపడగా అందులో ఒకరు మరణించారు. ఇందులో అత్యధిక ప్రమాదాలు రాత్రి వేళలలో జరిగినవే ఉన్నాయి. అంచనా వేయడంలో పొరపాటు? ప్రమాదాలు జరిగినప ప్రదేశాలను పరిశీలించగా ట్రాఫిక్ బోర్డులు, హైవే సూచికలతో పాటు కోన్లు తదితర రక్షణ ఏర్పాట్లు సరిగానే ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశాల్లో లైట్ల వెలుతురు కూడా ఎక్కువగా ఉండటాన్ని నమోదు చేశారు. ఈ ప్రమాదాలు జరిగిన సమయంలో సగానికిపైగా కార్లు ఆటోపైలట్ మోడ్‌లోనే ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్లు, హెచ్చరిక బోర్డులను అంచనా వేయడంలో ఆటోపైటల్ వ్యవస్థ వందశాతం సమర్థంగా పని చేయడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం సహయకారి ఆటోపైలట్ వ్యవస్థ డ్రైవర్‌కు సహాయకారిగా ఉపయోగపడుతుందే తప్ప పూర్తిగా డ్రైవర్ లేకుండా కారును సమర్థంగా నడపలేదని తాము ముందు నుంచే చెబుతున్నామంటోంది టెస్లా. ఎదైనా ప్రమాదాలను, హెచ్చరికలను గుర్తించినప్పుడు డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుందే తప్ప స్వంతగా నిర్ణయాలు తీసుకోదని వెల్లడించింది. అదేవిధంగా డ్రైవర్ లెస్ కార్ల తయారీ అనేది ఇంకా కాన్సెప్టు దశలోనే ఉందంటోంది టెస్లా. -
డ్రైవర్‌లెస్ కార్లు రయ్!
సింగపూర్‌లో వీటితో ప్రయోగాత్మక ట్యాక్సీ సేవలు షురూ • అమెరికాలో ప్రారంభానికి ఉబెర్ సన్నాహాలు • రేసులో గూగుల్, ఫోర్డ్, జీఎం, యాపిల్, టెస్లా • 2021 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి! • హై సైబర్ సెక్యూరిటీ ముఖ్యమంటున్న నిపుణులు మనకు ట్రాన్స్ఫార్మర్స్ సినిమా గుర్తుండే ఉంటుంది. అది పిల్లలతోపాటు పెద్దలను కూడా విపరీతంగా ఆకర్షించింది. ఇందులో కార్లు కార్లు మాట్లాడుకుంటాయి. అలాంటి పరిస్థితే ఇప్పుడు నిజజీవితంలో మనకు ఎదురు కాబోతుంది. వచ్చే ఐదేళ్లలో డ్రైవర్ల అవసరం లేకుండానే కార్లు మనల్ని గమ్యస్థానాలకు చేర్చబోతున్నాయి. పలు పెద్ద పెద్ద కంపెనీలు డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధికి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాయి. ఆ కంపెనీల్లో మనకుముందుగా గుర్తొచ్చే పేరు గూగుల్. ఇదే మొదటిగా డ్రైవర్‌లెస్ కార్ల తయారీకి శ్రీకారం చుట్టింది. తర్వాత టెస్లా మోటార్స్, జీఎం, ఫోర్డ్ వంటి కంపెనీలు గూగుల్‌ను అనుసరించాయి. ఇప్పుడు ఉబెర్ వీటికి జత కలిసింది. దీంతో కంపెనీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. కాగా న్యూటానమీ అనే స్టార్టప్ గురువారం డ్రైవర్‌లెస్ కార్ల ట్యాక్సీ సర్వీసులను సింగపూర్‌లో ట్రయల్స్ విధానంలో ప్రారంభించింది. అమెరికాలో ఉబెర్ సెల్ఫ్‌డ్రైవింగ్ రైడ్స్ రైడ్ షేరింగ్ సర్వీసెస్ సంస్థ ఉబెర్ ప్రయాణికుల రవాణా కోసం కొన్ని వారాల్లో సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లను ఉపయోగించనున్నది. ఈ సేవలను తొలిగా అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ప్రారంభించనున్నది. తర్వాత వీటిని ఇతర ప్రాంతాలకు విస్తరించన్నుది. ఇక్కడ అత్యవసర పరిస్థితులను నియంత్రించడానికి కారులో ఒక డ్రైవర్ కూడా ఉంటాడు. కాగా ఉబెర్ 2021 నాటికి పూర్తిస్థాయి అటానమస్ కార్లను మార్కెట్లోకి తెచ్చే అవకాశముంది. డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధి, తయారీకి స్వీడన్ కార్ల కంపెనీ వోల్వోతో కలిసి 300 బిలియన్ డాలర్ల డీల్‌కు తెరలేపింది. గూగుల్, ఫోర్డ్, జీఎం, యాపిల్, టెస్లా... ⇒ గూగుల్ 2009 నుంచి అటానమస్ కార్లను రోడ్లపై ప్రయోగాత్మకంగా తిప్పుతూనే ఉంది. ప్రస్తుతం ఇది బ్రేక్ పెడల్స్, స్టీరింగ్ ఉండని కార్లపై పరీక్షలు నిర్వహిస్తోంది. ఇది తన సాఫ్ట్‌వేర్‌ను ఇతర వాహన తయారీ కంపెనీలకు విక్రయించుకోవచ్చు లేదా షేర్ రైడింగ్ సంస్థలతో జతకట్టొచ్చు. ⇒ ఉబెర్ లాగానే సెల్ఫ్‌డ్రైవింగ్ ట్యాక్సీ సర్వీసులను వచ్చే ఏడాది ప్రారంభించడానికి జీఎం ప్రయత్నిస్తోంది. ఇది ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిక్సో, ఆరిజోనాల్లో వంటి ప్రాంతాల్లో అటానమస్ షెవర్లే బోల్ట్ కారును పరీక్షిస్తోంది. ⇒ మెర్సిడెస్ కూడా డ్రైవర్‌లెస్ కార్ల తయారీలో నిమగ్నమైంది. ⇒ రైడ్ షేరింగ్ సర్వీసుల ద్వారా పూర్తి స్థాయి అటానమస్ వెహికల్స్‌ను 2021 నాటికల్లా మార్కెట్లోకి తీసుకొస్తామని ఫోర్డ్ ప్రకటించింది. ⇒ ఇక టెస్లా కూడా అటానమస్ కార్ల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఇది ఇటీవలే (మే నెలలో) డ్రైవర్‌లెస్ కార్లపై పరీక్షలు నిర్వహించింది. కానీ అందులో ప్రమాదం జరిగి డ్రైవర్ మరణించారు. ⇒ యాపిల్ కూడా డ్రైవర్‌లెస్ కార్ల అభివృద్ధికి ప్రయత్నిస్తోంది. ఇది ఇప్పటికే కొన్ని వందల మంది ఇంజినీర్లకు టైటాన్ ప్రాజెక్టులో భాగంగా నియమించుకుంది. ⇒ టయోటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎంఐటీ, డెల్ఫి ఆటోమోటివ్, కాంటినెంటల్, సౌత్‌వెస్ట్ రీసెర్చ్, బైదూ వంటి సంస్థలు కూడా డ్రైవర్‌లెస్ కార్ల ఏర్పాటుకు నియామకాలను చేపట్టాయి. 600 బిలియన్ గంటలు వాహనాల్లోనే కాలం విలువైంది. సమయానికి అత్యంత ప్రాధాన్యమిస్తోన్న ఈ కాలంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు మంచి ఆదరణ లభిస్తుందని విశ్లేషకుల మాట. ప్రస్తుతం జనాలు వాహనాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్యాసెంజర్ వాహనాలు వార్షికంగా 10 ట్రిలియన్ మైళ్ల దూరం ప్రయాణిస్తున్నాయని అంచనా. వీటి సగటు వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉంది. అలాగే ప్రజలు 600 బిలియన్ గంటలు వాహనాల్లోనే గడిపేస్తున్నారు. డ్రైవర్‌లెస్/అటానమస్ వెహికల్స్ సర్వీస్ ప్రొవైడర్లు, తయారీదారులు ఈ సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని సైబర్‌మీడియా రీసెర్చ్ హెడ్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ థామస్ జార్జ్ తెలిపారు. డేటా ప్రధానం.. ఏ అటానమస్ వెహికల్‌కు అయినా డేటా ప్రధానమని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రీసెర్చ్ మేనేజర్ (ఎంటర్ప్రైజ్) గౌరవ్ శర్మ అభిప్రాయపడ్డారు. దీంతో సురక్షితమైన సులభమైన ప్రయాణం సాధ్యమౌతుందన్నారు. సమాచారాన్ని స్వీకరించి, ప్రాసెసింగ్ చేసుకొని, దీని ద్వారా ఇతర భాగాలను నియంత్రించడం క్లిష్టమైన ప్రక్రియని వివరించారు. డ్రైవర్‌లెస్ కార్లు విజయవంతమవ్వాలంటే.. చట్టాలు, నిబంధనలు, నియంత్రణలు, ట్రాఫిక్ సిస్టమ్, ఇన్ఫ్రా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్, మాన్యుఫాక్చరింగ్, డేటా అండ్ ఇన్ఫర్మేషన్ నిర్వహణ, ప్రాసెసింగ్ వ్యవస్థ వంటి అంశాలు వేగంగా మారాల్సి ఉందని పేర్కొన్నారు. భారత్‌లో చాలా మందికి వాహన రంగం ఉపాధిని కల్పిస్తోందని, వారు కూడా కొత్త టెక్నాలజీకి అలవాటు పడాల్సి ఉంటుందని, నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో డ్రైవర్‌లెస్ కార్లు జనాలకు సుపరిచితం కావొచ్చన్నారు. హ్యాక్ అయితే అంతే! ఆటోమెటిక్, సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లు హ్యాకింగ్‌కు గురైతే సంభవించే పరిణామాలు మామూలుగా ఉండబోవని నిపుణులు పేర్కొన్నారు. చాలా అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. డ్రైవర్‌లెస్ కార్లను తయారుచేసే వారు హై సెక్యూరిటీ, సైబర్ భద్రతలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. టెస్లా/గూగుల్ కార్ల ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇవీ ప్రయోజనాలు... ⇒ పార్కింగ్ సమస్యను తప్పించుకోవచ్చు. ⇒ కంపెనీలు భద్రతకు అధిక ప్రాధాన్యంఇస్తున్నాయి. ⇒ సాధారణంగా డ్రైవర్లకు వేతనాలు ఇవ్వాలి. ఇక్కడ వాటితో పని ఉండదు. అలాగే వారు 24 గంటలూ పనిచేయరు. ఇవి అలా కాదు. వీటిల్లో ఎప్పుడైనా.. ఎక్కడికైనా వెళ్లొచ్చు. ⇒ పిల్లలను స్కూళ్లకు పంపొచ్చు. పిక్అప్ చేసుకోవచ్చు. మనం ఆఫీస్‌కు రావొచ్చు. ఇంట్లోని అందరూ ఒకే కారును వాడొచ్చు. ⇒ కంపెనీలు వారి స్టాఫ్, ఉద్యోగుల రవాణాకు వాటిని వినియోగించుకోవచ్చు.