ఢిల్లీ: దేశ రాజధానిలో భారీ భూకంపం సంభవించింది. పలుచోట్ల భూప్రకంపనలు సంభవించగా.. జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. భూకంప కేంద్రం నేపాల్‌కు సమీపంలో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది.
ఢిల్లీతో సహా పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్‌లో 40 సెకన్లపాటు భూప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 2:25 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. కార్యాలయాలు, ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
#earthquake
— ROAMER BOYS YT (@PUBGInd98835045) October 3, 2023
In Delhi - NCR
people coming out from offices pic.twitter.com/9G8lAImsVZ
దేశ రాజధానిలో నేడు రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. మొదట ఆఫ్గానిస్థాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. రెండోసారి నేపాల్ భూకేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.
ఇదీ చదవండి: Pakistan Earthquake Prediction: పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు?
Comments
Please login to add a commentAdd a comment