Booster doses won't stop the rapid spread of Omicron variant: కోవిడ్-19 కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ దాదాపు నియంత్రించలేం అని నిపుణులు నొక్కి చెబుతున్నారు. పైగా బూస్టర్ వ్యాక్సిన్‌లు ఈ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేవని, ప్రతి ఒక్కరూ ఈ వైరస్ బారిన పడతారని వక్కాణించారు. అయితే ఈ కొత్త రకం వేరియంట్‌కి భయపడవలసిన అవసరంలేదని నిజానికి అందరూ ఈ వైరస్‌ని ఎదుర్కోగలరని అన్నారు.
ఇది డెల్టా కంటే ప్రమాదకరమైనది కాదని కాకపోతే ఆచరణాత్మకంగా మాత్రం ఈ ఒమిక్రాన్ వైరస్ ఉధృతిని ఆపలేం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీకి సంబంధించిన సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జైప్రకాష్ ములియిల్ అన్నారు.అయితే ఇక ఈ వ్యాధి మనకు జలుబు వలే వస్తుంటుందని కూడా చెప్పారు. పైగా దీన్ని ఎదుర్కొగల సహజ రోగ నిరోధక శక్తి మనలో ఉంటుందని, అందువల్ల భారత్ ఇతర దేశాల మాదిరి తీవ్రంగా ప్రభావితం కాలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు వ్యాక్సిన్‌లు ప్రవేశ పెట్టక ముందే మన దేశంలో దాదాపు 85% మందికి కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు.
అలాగే వ్యాక్సిన్‌లు అనేవి శాశ్వత సహజ వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏ వైద్య సంస్థలు బూస్టర్ డోస్‌లు వైరస్ భారిన పడకుండా చేయగలవని స్పష్టం చేయలేదనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఈ బూస్టర్ డోస్‌లు కేవలం ముదు జాగ్రత్త చర్యగా తీసుకునే చికిత్సలో భాగమే తప్ప ఆ వైరస్ భారిన పడకుండా మాత్రం కట్టడి చేయలేదని తెలిపారు. ఈ మేరకు బూస్టర్ డోస్ తీసుకున్నవాళ్లు సైతం ఈ కరోనా వైనస్ బారిన పడ్డారని నివేదికలు చెబుతున్నాయని ములియిల్ చెప్పారు.
(చదవండి: యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడి కన్నుమూత)
(చదవండి: నిందితుడికి బెయిల్.. అతన్ని రాత్రి గృహనిర్బంధం చేయాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment