సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఇటీవల తప్పుదారి పట్టించే వార్తలు చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. మహిళా స్వరోజ్‌గార్ యోజన కింద మహిళల బ్యాంకుల ఖాతాల్లో మోదీ ప్రభుత్వం లక్ష రూపాయలు జమ చేస్తుందని సోషల్ మీడియా వేదికలపై ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఈ వైరల్ పోస్ట్ వెనుక వాస్తవాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిగ్గుతేల్చింది. మహిళల బ్యాంకు ఖాతాల్లో పైన చెప్పిన మొత్తం డిపాజిట్ చేస్తామని ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త ఫేక్ న్యూస్ అని తేల్చేసింది. మీకు ఎలాంటి అనుమానిత మెసేజ్‌లు వచ్చినా అది నిజమైన వార్తా లేక ఫేక్ న్యూసా అని నిర్ధారించేందుకు మీరు ఆ మెసేజ్‌ను https://factcheck.pib.gov.in. పంపడం ద్వారా నిజానిజాలు ధ్రువీకరించుకోవచ్చు.https://pib.gov.in.పై కూడా మీరు ఫ్యాక్ట్ చెక్ సమాచారాన్ని పొందవచ్చు. చదవండి : వైరల్: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది
Comments
Please login to add a commentAdd a comment