సాక్షి, చండీగఢ్ : కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ రైతులు నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) పిలుపునిచ్చాయి.
పంటలకు కనీస మద్దతు ధర (MSP), స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు సాయం అందించడం సహా ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’కు పిలుపునిచ్చాయి.
రైతుల ఆందోళనల్ని ప్రారంభించి 38 రోజులు పూర్తైన సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానా పోలీసులు జరిపిన కాల్పుల్లో పంజాబ్ యువ రైతు శుభకరన్ మరణించారు. దీంతో ఆయనకు నివాళులు అర్పించేందుకు ప్రారంభించిన ‘అస్తి కలశ్ యాత్ర’ లక్షలాది మంది దర్శించుకుని నివాళులర్పించినట్లు రైతు నాయకులు తెలిపారు.
ఆస్తి కలశ్ యాత్ర తర్వాత మార్చి మార్చి 31 అంబాలాలోని మోహ్రా మండిలో శుభకరన్ సింగ్‌కు అంకితం చేస్తూ ఏర్పాటు భారీ ఎత్తున సంతాప సభను ఏర్పాటు చేసినట్లు, ఈ సభలో ఎస్‌కేఎం, కేఎంఎం రైతు నాయకులు పాల్గొనున్నారు.
బక్సర్ జిల్లాలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, వారి కుటుంబాలపై దాడిని ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని నేతలు అన్నారు. పోలీసులు ఇళ్లలోకి చొరబడి మహిళలు, వృద్ధులను కొట్టిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రైతు నాయకులు బల్దేవ్ జిరా చెప్పారు. మార్చి 23న శంభు, ఖానౌరీలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పిన రైతు నాయకులు.. లడఖ్‌లోని రైతులు కూడా ఈ పోరాట యాత్రలో పాల్గొంటారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment