portest
-
నల్ల జెండాలు ఎగురవేయాలంటూ రైతు సంఘాల పిలుపు
సాక్షి, చండీగఢ్ : కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ రైతులు నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) పిలుపునిచ్చాయి. పంటలకు కనీస మద్దతు ధర (MSP), స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు సాయం అందించడం సహా ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’కు పిలుపునిచ్చాయి. రైతుల ఆందోళనల్ని ప్రారంభించి 38 రోజులు పూర్తైన సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానా పోలీసులు జరిపిన కాల్పుల్లో పంజాబ్ యువ రైతు శుభకరన్ మరణించారు. దీంతో ఆయనకు నివాళులు అర్పించేందుకు ప్రారంభించిన ‘అస్తి కలశ్ యాత్ర’ లక్షలాది మంది దర్శించుకుని నివాళులర్పించినట్లు రైతు నాయకులు తెలిపారు. ఆస్తి కలశ్ యాత్ర తర్వాత మార్చి మార్చి 31 అంబాలాలోని మోహ్రా మండిలో శుభకరన్ సింగ్‌కు అంకితం చేస్తూ ఏర్పాటు భారీ ఎత్తున సంతాప సభను ఏర్పాటు చేసినట్లు, ఈ సభలో ఎస్కేఎం, కేఎంఎం రైతు నాయకులు పాల్గొనున్నారు. బక్సర్ జిల్లాలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, వారి కుటుంబాలపై దాడిని ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని నేతలు అన్నారు. పోలీసులు ఇళ్లలోకి చొరబడి మహిళలు, వృద్ధులను కొట్టిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రైతు నాయకులు బల్దేవ్ జిరా చెప్పారు. మార్చి 23న శంభు, ఖానౌరీలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పిన రైతు నాయకులు.. లడఖ్‌లోని రైతులు కూడా ఈ పోరాట యాత్రలో పాల్గొంటారని వెల్లడించారు. -
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా....
-
చిలీ సింగర్ అర్ధ నగ్నంగా.......
చిలీలో మానవ హక్కులకు కాలరాసి ప్రజలను హింసిస్తున్న భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రముఖ చిలీ–మెక్సికన్ గాయనీ మాన్ లఫ్తార్టే గురువారం నాడు లాస్ వెగాస్‌లో జరిగిన 20వ లాటిన్ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన జరిపారు. నిరసనగా గుర్తుగా నల్లటి ప్యాంట్, నల్లటి కోటు ధరించిన ఆమె రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వేదికపైకి ఎక్కి కోటును కిందకు జారవిడిచి తన వక్షోజాలను బయట పెట్టారు. తన చిలీ ప్రజలను హింసించి, రేప్ చేసి, చంపుతున్నారన్న మెడ మీదు నుంచి వక్షోజాల కింది వరకు రాసుకున్నారు. ఆ తర్వాత చిలీ ప్రజల పోరాటానికి మద్దతుగా ఆమె చిలీ కవి రాసిన కవిత్వాన్ని వినిపించారు. ఆ తర్వాత పోరాటానికి మద్దతుగా పాటను కూడా పాడి వినిపించారు. మాన్ లఫ్తార్టే తన పాటలకు వచ్చిన రెండో ‘గ్రామీ అవార్డు ట్రోపీ’ని అందుకోవడానికి అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత ఆమె తెల్లటి గౌను ధరించి నవ్వుతూ ట్రోపీతో ప్రేక్షకుల ముందు కనిపించి ఆకట్టుకున్నారు. మంచి పింఛన్లు ఇవ్వాలంటూ మంచి ఆరోగ్య భద్రతను కల్పించాలంటూ, విద్యావకాశాలను పెంచాలంటూ లక్షలాది మంది చిలీ ప్రజలు వీధుల్లోకి వచ్చి గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. వారి ఆందోళనలను అణచి వేసేందుకు చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పియనెరా, అక్టోబర్ 19వ తేదీన దేశంలో అత్యయిక (ఎమర్జెన్సీ) పరిస్థితిని విధించారు. నాటి నుంచి చిలీ భద్రతా దళాలు ప్రజలను నిర్బంధించి హింసిస్తున్నాయి. కొంత మంది మహిళలను రేప్‌లు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు పేల్చిన పెల్లెట్స్ వల్ల నెల రోజుల్లో దాదాపు 200 మంది అంథులయ్యారు. -
న్యాయం చేయాలని వివాహిత ఆందోళన
తుంగతుర్తి: తన భర్తను దాచిపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న అత్తమామ, ఆడపడుచుపై చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన గుండగాని వెంకన్న, పద్మ దంపతుల కుమార్తె విజయ, అదే గ్రామానికి చెందిన దుబ్బాక సోమిరెడ్డి విజయలక్ష్మిల కుమారుడైన దుబ్బాక సాయి కిరణ్‌రెడ్డి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను కిరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మూడు మాసాల క్రితమే ఆలయంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కిరణ్‌రెడ్డి విజయ ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా, గత 15 రోజుల క్రితం కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసి వస్తానని ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ నెల 1వ తేదీన విజయ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తను అత్తింటి వారే దాచి పెట్టారని ఆరోపిస్తూ విజయ మంగళవారం ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకుని ట్రైనీ ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 11వ తేదీలోపు కిరణ్‌రెడ్డిని అప్పగిస్తామని వారి తల్లిదండ్రి తెలిపారని వివరించారు. బాధితురాలికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించింది. విజయకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.