
న్యూఢిల్లీ : నోయిడాలోని ఓ సబ్‌స్టేషన్‌లో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. పవర్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పిసిఎల్) లోని 148 సబ్‌స్టేషన్ వద్ద మంటలు వ్యాపించాయి. పవర్‌స్టేషన్ నుంచి నోయిడా మెట్రోకు విద్యుత్ సరఫరాను అందిస్తుండగా ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే సహాయక చర్యల్లో పాల్గొంది. సబ్‌స్టేషన్ మొత్తం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొన్ని కిలోమీటర్ల మేర దట్టమైన పొగ కమ్మేసింది. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.