లక్నో: కరోనాతో ఉద్యోగాలు ఊడిపోవడమే కాదు, ఎన్నికల వేళ కొత్త ఉద్యోగాలను కూడా కల్పిస్తోంది. ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తూ ఉండటంతో జనవరి 31 వరకు భౌతిక ప్రచారాలు, రోడ్డు షోలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఆన్‌లైన్ ప్రచారాలే ఉధృతంగా సాగుతున్నాయి. వీటిని నిర్వహించడానికి టెక్నాలజీపై పట్టున్న యువకులకు తాత్కాలికంగానైనా ఉపాధి లభిస్తోంది. (క్లిక్: ప్రతిష్టాత్మక పోరు.. ‘కైరానా’ మే హైరానా!)
సామాజిక మాధ్యమాలపై అవగాహన, కంప్యూటర్ నాలెడ్జ్, ఫొటోగ్రఫీ ఎడిటింగ్ తెలిసి ఉన్న గ్రామీణ ప్రాంతంలో యువతని వెతుక్కుంటూ వెళ్లి మరీ వివిధ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉద్యోగాలు ఇస్తున్నారు. సైబర్ స్మార్ట్ డిజిటల్ క్యాంపెయినర్లుగా నియమిం చుకుంటున్నారు. ప్రచారం కొత్తగా ఉండడం, ఓటు వేయాలని అభ్యర్థిస్తూ తయారు చేసే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చూడడం వంటివి చెయ్యాల్సి ఉంటుంది. ‘‘వివిధ సామాజిక మాధ్యమాల్లో రోజుకి కనీసం 10 నుంచి 15 పోస్టులు పెట్టాలి. అవన్నీ రీ ట్వీట్ అయ్యేలా చూసుకోవాలి. రకరకాల గ్రూపులు నిర్వహించాలి. ఆ పోస్టులు వైరల్ అయ్యేలా చూడాలి. ఓటు వేయమని అభ్యర్థిస్తూ సృజనాత్మకంగా పోస్టులు తయారు చేయాలి’’ అని తనూజ్ పాండే అనే యువకుడు చెప్పాడు. (క్లిక్: బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా?)
బారాబంకికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర సింగ్ తరఫున పాండే పని చేస్తున్నారు. ఈ డిజిటల్ క్యాంపెయినర్లకి వారు చేసే పని, పోటీ చేసే అభ్యర్థి స్థాయి, వారు పని చేసే ప్రాంతం ఆధారంగా నెలకి రూ.20 వేల నుంచి లక్ష వరకు వేతనం లభిస్తోంది. బాదాన్‌కి చెందిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్ చంద్ర దగ్గర డిజిటల్ క్యాంపెయినర్ల బృందంలో అయిదుగురు ఉన్నారు. వారిలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, ఇద్దరు గ్రాఫిక్ డిజైనర్లు, సోషల్ మీడియా వ్యవహారాలు చూసే ఒక టెక్కీ ఉన్నారు. ఇలా ఎవరి స్థాయిలో వారు డిజిటల్ క్యాంపెయినర్లను నియమిస్తూ ఉండడంతో యూపీ పల్లెల్లో యువత బిజీ బిజీగా కాలం గడుపుతోంది. (క్లిక్: ఆ పార్టీకి బలమూ ఆయనే.. బలహీనత ఆయనే)
Comments
Please login to add a commentAdd a comment