న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్ల తీరుపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికారాన్ని దురి్వనియోగం చేయవద్దని గవర్నర్లకు సూచించింది. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్‌లో కొనసాగించడం తగదని తేలి్చచెప్పింది. అలాంటి స్వేచ్ఛ గవర్నర్లకు లేదని స్పష్టం చేసింది.
ప్రజల చేత ఎన్నిక కాని గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా కొన్ని అధికారాలు ఉన్నప్పటికీ రాష్ట్రాల శాసనసభల్లో చట్టాలు చేసే ప్రక్రియను అడ్డుకోవడానికి ఆ అధికారాలను ఉపయోగించుకోవద్దని హితవు పలికింది. ఇలాంటి చర్యలు ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేల అధికారాన్ని తగ్గంచేలా ఉంటాయని తేలి్చచెప్పింది.
అసెంబ్లీలో తీర్మానించిన నాలుగు కీలక బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 10న 27 పేజీల తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రపతి నియమించే గవర్నర్ రాష్ట్రానికి నామమాత్ర అధిపతి మాత్రమేనని ఉద్ఘాటించింది. ఈ ఏడాది జూన్ 19, 20వ తేదీల్లో పంజాబ్ అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment