Power Misuse
-
బిల్లులను అడ్డుకొనే స్వేచ్ఛ గవర్నర్లకు లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్ల తీరుపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికారాన్ని దురి్వనియోగం చేయవద్దని గవర్నర్లకు సూచించింది. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్‌లో కొనసాగించడం తగదని తేలి్చచెప్పింది. అలాంటి స్వేచ్ఛ గవర్నర్లకు లేదని స్పష్టం చేసింది. ప్రజల చేత ఎన్నిక కాని గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా కొన్ని అధికారాలు ఉన్నప్పటికీ రాష్ట్రాల శాసనసభల్లో చట్టాలు చేసే ప్రక్రియను అడ్డుకోవడానికి ఆ అధికారాలను ఉపయోగించుకోవద్దని హితవు పలికింది. ఇలాంటి చర్యలు ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేల అధికారాన్ని తగ్గంచేలా ఉంటాయని తేలి్చచెప్పింది. అసెంబ్లీలో తీర్మానించిన నాలుగు కీలక బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 10న 27 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రపతి నియమించే గవర్నర్ రాష్ట్రానికి నామమాత్ర అధిపతి మాత్రమేనని ఉద్ఘాటించింది. ఈ ఏడాది జూన్ 19, 20వ తేదీల్లో పంజాబ్ అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను ధర్మాసనం ఆదేశించింది. -
భావసారూప్య పార్టీలతో చేతులు కలుపుతాం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభు త్వం ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగానికి పా ల్పడుతోందని, అన్ని వ్యవస్థలనూ స్వలా భం కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణమే తమ ధ్యేయమని, ఇందుకోసం భావసారూప్యం కలిగిన రాజకీయ పక్షాలతో చేతులు కలుపుతామని, కలిసి పని చేస్తామని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో వెల్లడించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తోందని సోనియా దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దల చర్యలను పరికిస్తే ప్రజాస్వామ్యం కంటే తామే అధికులమన్న భావన వారిలో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషం, హింసను ప్రేరేపిస్తున్నాయని, ప్రధానమంత్రి ఉద్దేశపూర్వకంగానే వాటిని విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. శాంతి, సామరస్యం కోసం ప్రధాని ఏనాడూ పిలుపునివ్వలేదని ఆక్షేపించారు. మతం, ఆహారం, కులం, భాష పేరిట ప్రజలపై వివక్ష చూపుతున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీది కేవలం మాటల గారడీ రాబోయే కొన్ని నెలలు దేశ ప్రజాస్వామ్యానికి అగ్ని పరీక్షలాంటివని సోనియా అన్నారు. ‘‘ముఖ్య రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. దేశం కీలకమైన కూడలిలో ఉంది. రాజ్యాంగ ఆశయాల పరిరక్షణకు భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజావాణికి కాపలాదారుగా ఉంటాం. ప్రధాని మోదీ మాటల గారడీతో జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై లెక్కలేనన్ని కేసులు! బీజేపీలో చేరితే అవన్నీ మటుమాయం!’’ అని దుయ్యబట్టారు. -
ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ అరెస్ట్
న్యూఢిల్లీ: కోలొకేషన్ కేసులో ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రధాన కార్యాలయం లాకప్‌లో ఉంచారు. సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం చిత్రా పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిల్‌ను తిరస్కరించిన మర్నాడే అధికారులు అరెస్ట్ చేయడం గమనార్హం. గత మూడు రోజులుగా అధికారులు ఆమె నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎన్ని ప్రశ్నలు వేసినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఎన్ఎస్ఈ కొలోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్ఎస్ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్ఎస్ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్ఎస్ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్ చేసింది. -
అభిశంసనపై వాదనలకు ట్రంప్ లాయర్ల బృందం ?
వాషింగ్టన్: ఈ నెల 8వ తేదీ నుంచి సెనేట్‌లో ప్రారంభం కానున్న తన అభిశంసన విచారణకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి ట్రంపే కారణమనీ, అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన 10 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు. దీంతో ఈ నెల 8వ తేదీన అభిశంసనపై విచారణకు మార్గం సుగమ మైంది. ట్రంప్ తరఫున ప్రముఖ లాయర్లు డేవిడ్ ష్కోయెన్, బ్రూస్ ఎల్ కాస్టర్ వాదనలు వినిపించనున్నారు. డెమోక్రాట్లు మూడింట రెండొంతుల మద్దతు సాధిస్తే అభిశంసన ఆమోదం పొందుతుంది. ఫలితంగా ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం కోల్పోతారు. అయితే, సెనేట్‌లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు చెరో 50 మంది సభ్యుల బలం ఉంది. తీర్మానం ఆమోదం పొందాలంటే డెమోక్రాట్లకు మరో 17 మంది మద్దతు అవసరం. అమెరికా చర్రితలో రెండుసార్లు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం. -
నేతల జల్సా
సింగరేణిలో కార్మిక నాయకుల వ్యవహారశైలి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. మస్టర్లు పడి విధులకు వెళ్లడం లేదు. యాజమాన్యమూ పట్టించుకోవడం లేదు. దీంతో సాధారణ కార్మికులపై పనిభారం, కంపెనీపై ఆర్థికభారం పెరుగుతోంది. సాధారణ కార్మికుడిపై అగ్గి మీద గుగ్గిలమయ్యే అధికారులు.. జల్సా చేస్తున్న నాయకుల విషయానికొచ్చే సరికి చేష్టలుడిగి చూస్తున్నారు. రామకృష్ణాపూర్(మంచిర్యాల జిల్లా) : సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం, ప్రాతినిధ్య సంఘం(గత ఎన్నికల్లో గెలిచిన) నాయకుల హవాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. బడా నేతలే కాదు చోటా మోటా నాయకులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, గనుల మీద మస్టర్లు పడి, విధులకు వెళ్లకుండా బయటే పచార్లు కొడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కమిటీల పేరిట ఇష్టారాజ్యం సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన యూనియన్‌కు వివిధ కమిటీల్లో ప్రాధాన్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ గనికి పిట్ కమిటీ, క్రీడలు, ఆలయాలు, క్యాంటీన్లు, రక్షణ... ఇలా పలు రకాల కమిటీలను నియమిస్తారు. ఒక గనిని తీసుకుంటే కనీసం 10 మంది వరకు గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులు ఉంటారు. వీరిలో చాలా మంది మస్టర్లు పడడమే తప్ప విధులు నిర్వర్తించిన పాపాన పోవడం లేదు. కొన్ని సంవత్సరాల తరబడి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో కార్యక్రమాలు మరింతగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం విజయవంతం చేసేందుకు సంస్థ సైతం అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవడంతో నాయకులు మరింతగా రెచ్చిపోయారు. అవకాశం చిక్కిందంటే చాలు మూకుమ్మడిగా మస్టర్లు పడి కార్యక్రమాల్లో సొంత పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఇటీవల మందమర్రి ఏరియా పరిధిలోని ఓ జాతర ఏర్పాట్లకు సంబంధించి జీఎం పర్యటించిన సమయంలో ఏకంగా 20 మందికి పైగా యూనియన్ నాయకులు తరలిరావడం ఒకింత చర్చకు దారితీసింది. వీరంతా వారివారి డిపార్టుమెంట్లలో మస్టర్ పడి రావడం గమనార్హం. సంస్థకు రూ.కోట్లలో టోపీ నాయకుల వ్యవహార శైలి సింగరేణి సంస్థపై పెనుభారం మోపుతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో కార్మికునికి మస్టర్‌కు కనీసం 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల నుంచి కనీసం 10 చొప్పున తీసుకున్న మొత్తం 470 మంది వరకు నాయకులు ఉంటారని తెలుస్తోంది. 29 భూగర్భ గనుల్లో 290 మంది, 18 ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో 180 మంది మస్టర్లు పడే వారుంటారు. వారు విధులు నిర్వర్తించకున్న వేతనం చెల్లించాల్సిన పరిస్థితి. 1500 రూపాయల చొప్పున నెలకు 25 మస్టర్లకు గణించిన 470 మందికి కోటి 76 లక్షల 25 వేల రూపాయలు అవుతుంది. నెలకు కనిష్టంగా 20 మస్టర్ల చొప్పున తీసుకుంటే 1500 రూపాయల చొప్పున రూ. కోటి 41 లక్షల వ్యయం చేయాల్సి వస్తోంది. కనీసం ఏ పని ముట్టు ముట్టకుండా, చేతికి మట్టి అంటకుండానే గుర్తింపు కార్మిక సంఘం నాయకులకు వేతనాల రూపంలో ఇలా ముట్టజెపాల్సి వస్తోంది. ఈ లెక్కన సంవత్సరానికి ఎంతమేరకు అనవసరపు దుబారా సంస్థపై పడుతుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఉన్నా.. మస్టర్! విధుల అనంతరం ఔట్ టైం పడితేనే కార్మికుడి మస్టర్ లెక్కలోకి తీసుకుంటారు. కానీ జనరల్ షిఫ్టుల పేరిట మస్టర్లు పడుతూ బయట తిరిగే నాయకులకు ఇవేవి వర్తించవు. తతంగమంతా తెలిసినా సంబంధిత విభాగం సిబ్బంది అంతా చూసుకుంటారు. అవసరమైతే అమెరికాలో ఉన్నా స్థానికంగా మాత్రం విధుల్లో ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తాయి. ఇదంతా షరామామూలే అన్నట్లు ఉంటుంది. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. తాము అత్యవసర పని మీద కూడా బయటకు వెళ్లలేకపోతున్నామని, అదే నాయకులైతే, మస్టర్ పడి జల్సా చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. -
అందులో భాగంగానే వైఎస్ జగన్ పై కేసు: కోదండరాం
హైదరాబాద్: అధికార దుర్వినియోగంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టడం జరిగిందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. గత ప్రభుత్వాలు అనేక రకాలుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డాయని ఆయన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పుస్తకావిష్కరణ సభలో కోదండరాం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు అధికార దుర్వినియోగం చేసి అనేక మందిపై కేసులు పెట్టారని.. అందులో వైఎస్ జగన్‌పై కేసు పెట్టడం కూడా ఒకటి అని అన్నారు. గుప్పెడు మంది వ్యక్తులకోసం ప్రభుత్వాలు చేయకూడని పనులన్నీ చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి తెలంగాణ ప్రభుత్వంలో అలాంటివి జరగకుండా చూడాలని ఆయన హెచ్చరించారు.