లోక్‌సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: మోటార్ వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురై క్షతగాత్రులుగా మారినవారికి నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ పథకాన్ని ఛత్తీస్‌గఢ్, అస్సాంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి–జన ఆరోగ్య యోజన(ఏబీపీఎం–జేఏవై) కింద క్షతగాత్రులు ప్రమాదం జరిగిన తేదీ నుంచి వారం రోజులపాటు నిర్దేశిత ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల విలువైన వైద్యం పొందవచ్చని చెప్పారు. నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్‌హెచ్‌ఓ) భాగస్వామ్యంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. మోటార్ వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 164బీ కింద ఏర్పాటైన మోటార్ వాహనాల ప్రమాధ నిధి నుంచి ఈ పథకానికి అవసరమైన నిధులు సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment