న్యూఢిల్లీ: కోవిడ్ నిర్ధారణ పరీక్షను(ర్యాపిడ్ టెస్ట్) ఇంటి వద్దే చేసుకునే విధంగా ఎట్-హోం కోవిడ్ టెస్టింగ్ కిట్లకు ఐసీఎంఆర్ అనుమతించింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ కిట్లు మార్కెట్‌లోకి రానున్నాయని ప్రకటించింది. ఒక్కో కిట్ ధర రూ. 250 నిర్ణయించినట్లు ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవ్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో రోజువారీ కరోనా టెస్టుల సంఖ్య 20 లక్షలుగా ఉండగా, ఈ సంఖ్యను ఈ నెలాఖరుకు 25 లక్షలకు, జూన్ ఆఖరుకు 45 లక్షల పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామని ఆయన ప్రకటించారు. ఎట్-హోం కోవిడ్ టెస్టింగ్ కిట్ల రాకతో టెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment