మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రం
జయపురం: ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో మావోయిస్టులు విడుదల చేసిన కొన్ని వందలాది కరపత్రాలు మంగళవారం కనిపించాయి. ప్రధానంగా బీడీఓ కార్యాలయం వద్ద హిందీ భాషలోని కరపత్రంలో ఝోరిగాం సమితి దగ్గరున్న తేల్ నదిపై ప్రతిపాదిత డ్యామ్‌ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మావోయిస్టులు పేర్కొన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను నిరసిస్తూ ఆందోళనన చేపడతామన్నారు. ముఖ్యంగా నవరంగపూర్ ఎంపీ రమేశ్ చంద్ర మఝి, ఝోరిగాం ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ర మఝిల ప్రజా వ్యతిరేక విధానాలను దళం ఖండిస్తోందన్నారు.
చదవండి: స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ!
అలాగే విద్యుత్ సరఫరాలో టాటా కంపెనీ కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ విషయాల్లో మార్పు రాకపోతే బాగోదని హెచ్చరించారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉదంతి మావోయిస్ట్ డివిజన్ పేరిట పోస్టర్లు, కరపత్రాలతో మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కనిపించిన మావోయిస్టుల కరపత్రాలు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: మావోయిస్టుల పట్టుతప్పుతోంది...
Comments
Please login to add a commentAdd a comment