న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల ఘటనలో న్యాయం చేయాల్సిందిగా భారత్ గురువారం పాకిస్తాన్‌ను కోరింది. ఇటీవల ముంబై ఉగ్రదాడిలో పాల్గొన్న 19 మంది ఉగ్రవాదులను పాకిస్థాన్ మోస్ట్ వాంటెడ్ హై ఫ్రొఫైల్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) చేర్చింది. 2008 నాటి ఉగ్రదాడికి వీరంతా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. వీరంతా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వారే. ముంబై ఉగ్రదాడిలో పాకిస్తానీ టెర్రరిస్టులు పాల్గొన్నారన్నది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ ఉగ్రవాదులకు అండగా ఉంటూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.(ముంబై దాడుల దోషి రానా మళ్లీ అరెస్ట్)
ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి నవంబర్ 26తో 12 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటికైనా భారత్‌కు న్యాయం చేయాల్సిందిగా పాక్‌ను కోరారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..ఈ దాడిలో భారతీయులే కాక చాలామంది విదేశీ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా దాదాపు 15 దేశాలకు చెందిన 166 మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో పాకిస్తాన్ విఫలమయ్యిందని వ్యాఖ్యానించారు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులైన హఫీజ్ సయీద్, జాకీఉర్ రెహమాన్ లఖ్వీలకు వ్యతిరేకంగా పాక్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని శ్రీ వాస్తవ అన్నారు.
ఏఆర్ జడ్ వాటర్ స్పోర్ట్సు కరాచీ నుంచి యమహా మోటారు బోట్ ఇంజిను, లైఫ్ జాకెట్లు, గాలితో కూడిన పడవలను కొనుగోలు చేసేందుకు ఫైనాన్షియర్లు, అల్ హుసేనీ పడవ సిబ్బంది పేర్లను ఎఫ్‌ఐఏ జాబితాలో చేర్చింది. ఈ మేరకు 880 పేజీలకు పైగా సుదీర్ఘ నివేదిక తయారు చేసింది. 2008 నవంబరు 26న పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, త్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించిన ఘటన తెలిసిందే. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. (రాహుల్ గాంధీకి ఆ పట్దుదల లేదు : ఒబామా)
Comments
Please login to add a commentAdd a comment