Mumbai terror attack
-
హఫీజ్ సయీద్‌ను అప్పగించండి
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక వినతిని పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సయీద్‌ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలియజేశాయి. భారత్ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. 2008 నాటి ముంబై దాడులకు వ్యూహ రచన చేసిన హఫీజ్ సయీద్‌ను విచారించేందుకు భారత ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే కోరుతున్నా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. -
26/11 కుట్రదారుడు సాజిద్ మీర్‌పై విష ప్రయోగం!
ఇస్లామాబాద్: ఒకవైపు వరుసగా జరుగుతున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) కమాండర్ల మరణాలు అంతచిక్కని మిస్టరీగా మారాయి. మరోవైపు తాజాగా మరో ఎల్ఈటీ కమాండర్ సాజిద్ మీర్‌పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సాజీద్ మీర్.. కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పైన ఉన్న సాజిద్‌పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం అతనికి గత ఏడాది జూన్‌లో శిక్ష విధించగా.. ప్రస్తుతం లఖ్‌పత్ జైల్లో ఖైదీగా ఉంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ప్రాణాలకు ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో మరో జైలుకు బదిలీ చేసే సమయంలో ఆస్పత్రి పాలు కావటం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. BIG BREAKING: Bharat's Most Wanted Lashkar-e-Taiba terrorist, the main conspirator in the 26/11 Mumbai attacks, Sajid Mir, poisoned by 'UNKNOWN MEN' inside Central Jail Dera Ghazi Khan in Pakistan.Sajid is in critical condition and on a ventilator support; air-lifted by Pak… pic.twitter.com/efICEzadhs— Treeni (@_treeni) December 4, 2023 భారత్‌లో జరిగిన 26/11 ఉగ్రవాద దాడుల కుట్రదారుల్లో ఒకడైన సాజిద్ మీర్ గత ఏడాది అరెస్టయ్యాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగం రుజువు కావడంతో 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. సాజిద్ మీర్‌ను తమకు అప్పగించాలని అమెరికా.. గత కొంతకాలంగా పాక్‌పై ఒత్తిడి తెస్తోంది. అమెరికాకు అప్పగించడం ఇష్టం లేని ISI.. సాజిద్‌పై విషప్రయోగం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సాజిద్ తలకు అమెరికా FBI 5 మిలియన్ డాలర్ల వెల కట్టింది. 26/11 మంబై ఉగ్రవాద దాడి కుట్రదారుల్లో ఒకడైన సాజిద్.. ఉగ్రవాదులు ముంబై చేరడానికి తెర వెనక కావాల్సిన సాయం చేశాడు. ఇది కూడా చదవండి: బ్రిటన్ వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్.. -
Gautam Adani.. అలా 2 సార్లు చావు నుంచి తప్పించుకున్నారు
Gautam Adani Escaped Death Twice Once During 26 11 Mumbai Attack సాక్షి, వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముకేష్ అంబానీని.. వెనక్కు నెట్టి, ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు అదానీ. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అదానీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆసియా కుబేరుడిగా నిలిచిన అదానీ గతంలో రెండు సార్లు చావు నోటి నుంచి తప్పించుకున్నారట. టీనేజ్‌లో ఉండగా ఒకసారి.. 2008 ముంబైలో జరిగిన ఉగ్రదాడి సమయంలో మరోసారి అదానీ మృత్యుముఖం నుంచి బయటపడ్డారట. ఆ వివరాలు.. కాలేజీ డ్రాప్‌ఔట్.. ప్రస్తుతం ఆసియా కుబేరుడిగా ఖ్యాతి గాంచిన అదానీ కాలేజ్ డ్రాప్‌ఔట్. చదువు మధ్యలోనే ఆపేసి డైమండ్ ట్రేడర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ముంబై వెళ్లి అక్కడ మహేంద్ర బ్రదర్స్ కంపెనీలో పని చేశారు. అనంతరం 2-3 సంవత్సరాల తర్వాత ఆయన సొంతంగా ముంబై జవేరీ బజార్లో డైమండ్ బ్రోకరేజీ సంస్థను స్థాపించారు. (చదవండి: ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం, అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ) వ్యాపారంలో విజయంతో స్వరాష్ట్రంలో గుర్తింపు వజ్రాల వ్యాపారంలో విజయం సాధించాక 1981లో అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడ తన బంధువు స్థాపించిన పీవీసీ వ్యాపారంలో సాయం చేయసాగారు. ఆ తర్వాత అదానీ ఎక్స్‌పోర్ట్స్ కింద కమోడిటీస్ ట్రేడింగ్ వెంచర్‌ను స్థాపించారు. అది కూడా విజయవంతం అయ్యింది. ఫలితంగా స్వరాష్ట్రంలో గుర్తింపు లభించింది. బిజినెస్ పేపర్లలో అదానీకి సంబంధించిన వార్తలు రాసాగాయి. సక్సెస్‌తో పెరిగిన శత్రువులు.. విజయం.. పేరు ప్రఖ్యాతులతో పాటు శత్రువులను కూడా తీసుకొస్తుంది అంటారు. అదానీ విషయంలో ఇది నిజం అయ్యింది. 1990 మధ్య నాటికి అదానీ సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా రాణిస్తున్నారు. ఆయన సంపద పెరుగుతున్న కొద్ది శత్రువులు కూడా పెరగసాగారు. ఆయన ఆస్తి మీద ఆశతో కొందరు దుండగులు 1997లో అదానీని కిడ్నాప్ చేశారు. (చదవండి: అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు!) తలకు తుపాకీ గురిపెట్టి.. కిడ్నాప్ జనవరి 1, 1998న ఫైల్ అయిన పోలీసు రిపోర్ట్ ప్రకారం దుండగులు కర్ణావతి క్లబ్ నుంచి బయటకు వస్తోన్న అదానీని, ఆయనతో పాటు ఉన్న శాంతిలాల్ పటేల్‌ను కిడ్నాప్ చేశారు. సుమారు 11 కోట్ల రూపాయలు ఇస్తేనే వారిని విడుదల చేస్తామని డిమాండ్ చేశారు. అయితే అదానీని కిడ్నాప్ చేసింది అప్పటి అండర్ వరల్డ్ డాన్ ఫజల్-ఉర్-రెహ్మాన్ అలియాస్ 'ఫజ్లు రెహ్మాన్' అని వార్తలు వినిపించాయి. చివరకు అదానీ కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడ్డారు. అలా ఒకసారి మృత్యువు నుంచి తప్పించుకున్నారు అదానీ. 2008 మరో సారి.. నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రదాడిని దేశం ఇంకా మర్చిపోలేదు. ఈ సంఘటన జరిగిన నాడు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తాజ్ హోటల్లోనే అదానీ ఉన్నారు. ఉగ్రదాడి జరుగుతున్న సమయంలో బేస్మెంట్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. (చదవండి: పెట్టుబడులను ఆకర్షించడంలో అదానీ దూకుడు..!) దీని గురించి అదానీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘ఉగ్రదాడి జరిగిన సమయంలో నేను తాజ్ హోటల్లో దుబాయ్ పోర్ట్ సీఈఓ మహ్మద్ షరాఫ్‌ని డిన్నర్ కోసం కలిశాను. మేం హోటల్లో కూర్చుని మాట్లాడుకుంటుండగా.. ఉగ్రదాడి ప్రారంభం అయ్యింది. అందరం తలోదిక్కుకు పరిగెత్తాం. కొందరు సోఫాల వెనక కూర్చుని దాక్కున్నారు. నేను బేస్మెంట్లో దాక్కుని ఉన్నాను’’ అని తెలిపారు. ‘‘కమాండోలు వచ్చే వరకు అందరం ప్రాణాలు అరచేత పట్టుకుని.. దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ రోజు 15 అడుగుల దూరంలో నా మృత్యువు నాకు కనిపించింది. నవంబర్ 26 రాత్రి అంతా బేస్మెంట్లోనే ఉన్నాను. కమాండోలు మమ్మల్ని కాపాడి.. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన అహ్మదాబాద్ చేరుకున్నాను’’ అని తెలిపారు. అలా అదానీ రెండు సార్లు చావు నోటి నుంచి తప్పించుకున్నారు. చదవండి: అంబానీ.. అదానీ.. నువ్వా నేనా..! -
అతన్ని పట్టిస్తే రూ.37 కోట్లు ఇస్తాం : అమెరికా
వాషింగ్టన్ : ముంబై 26/11 మారణహోమానికి ఈ నవంబర్ 26తో పుష్కరకాలం పూర్తయింది.సరిగ్గా పన్నేండేళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం 2008 ముంబై దాడులకు పాల్పడడంలో కీలకంగా వ్యవహరించిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్‌పై భారీ నజరానా ప్రకటించింది. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన సాజిద్ మిర్ సమాచారం ఇచ్చినా లేక పట్టిచ్చిన వారికి 5 లక్షల అమెరికన్ మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో దాదాపు రూ. 37కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొన్నది. అమెరికాలో జరిగిన రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ సందర్భంగా సాజిద్ మిర్ సమాచారం ఇస్తే రూ. 37 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ముంబై దాడులకు లష్కరే ఆపరేషన్స్ మేనేజర్‌గా సాజిద్ మిర్ సూత్రధారిగా వ్యవహరించాడు. దాడుల ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ సాజిద్ దగ్గరుండి పర్యవేక్షించాడు. కాగా సాజిద్ మిర్ ను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 2011 ఏప్రిల్ 11 న దోషిగా ప్రకటించింది. ఉగ్రవాదులకు అన్ని విధాలా సాయపడ్డాడని, ఓ దేశంలో భారీ ప్రాణ, ఆస్థి నష్టానికి కారకుడయ్యాడని పేర్కొంది. కాగా 2008 నవంబరు 26 న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ముంబైలోని పలు హోటళ్లు, ప్రదేశాలను టార్గెట్లుగా చేసుకుని ధ్వంస రచనకు పూనుకొంది. ఈ నగరంలోని తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియో పోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, చత్రపతి శివాజీ టర్మినస్ వంటి పలు చోట్ల జరిగిన పేలుళ్లలో 166 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఆ ఘటనలో 9 మంది టెర్రరిస్టులు కూడా మృతి చెందగా సజీవంగా పట్టుబడిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను 2012 నవంబరు 11 న పూణే లోని ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. -
‘లష్కరే ఉగ్రవాదులను పిలిచే దాకా తేకండి’
బెంగళూరు: లష్కరే ఉగ్రవాదులు భారత వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించి నిన్నటికి 12 సంవత్సరాలు పూర్తయ్యింది. నాటి మారణకాండను తల్చుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులర్పించగా.. కర్ణటకలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. బహిరంగ ప్రదేశాల్లోని గోడ మీద లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మద్దతిచ్చే రాతలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాతల వెనక ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. వివరాలు మంగళూరులోని బహిరంగ ప్రదేశంలోని ఓ గోడ మీద గుర్తు తెలియని వ్యక్తులు ‘సంఘీలు, మన్వేదిలను నియంత్రించడానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులను, మిలిటెంట్లను రంగంలోకి దించే పరిస్థితులు తీసుకురాకండి’ అంటూ నలుపు రంగు పెయింట్‌తో గోడ మీద వివాదాస్పద రాతలు రాశారు. దీని గురించి తెలిసిన వెంటనే పోలీసుల అక్కడికి చేరుకున్నారు. పెయింటర్లను పిలిచి ఈ రాతలను కవర్ చేయించే పని ప్రారంభించారు. సమీప ప్రాంతంలోని సీసీటీవీ కెమరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నం చేసినందుకు గాను ఈ గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదు చేశామన్నారు. ఇక గోడ మీద రాసిన సంఘీలు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని సూచిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో గో వధను నిషేధించే చట్టంతో పాటు వివాహం కోసం మాత్రమే జరిగే మత మార్పిడిలను నిషేధించే చట్టం తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు నిర్ణయాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోడల మీద ఇలాంటి రాతలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా ముంబై ఉగ్రదాడి జరిగిన నాడే చోటు చేసుకోవడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ( 26/11 ఉగ్రదాడి : రియల్ హీరోలు వీళ్లే..) ఇక 12 సంవత్సరాల క్రితం ముంబైలో ఉగ్రవాదుల మారణ కాండ కొనసాగించారు. దీనిలో ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినవాడు. నాటి ఘటనలో 166 మంది చనిపోయారు.. 300 మందికిపైగా గాయపడ్డారు. సముద్ర మార్గం ద్వారా భారత్‌లో ప్రవేశించిన ముష్కరులు తాజ్‌మహల్ హోటల్ సహా పలు చోట్ల దాడులకు తెగబడ్డారు. -
26/11 విషాదం.. ‘మీ జ్ఞాపకాలే నా బలం’
26/11 వింటేనే చాలు ఇప్పటికి అనేక మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఆవేదనతో గొంతు పూడుకుపోతుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజున ముష్కరులు ముంబైలోని తాజ్ హోటల్ని అడ్డగా చేసుకుని రాక్షసకాండ సాగించారు. నాటి మారణహోమంలో 166 మంది చనిపోగా వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. నాడు మరణించిన వారిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ చౌదరి సోదరి, ఆమె భర్త కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని తలుచుకుంటూ ఆశిష్ చౌదరి భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్ననాటి ఫోటోలను, జ్ఞాపకాలని షేర్ చేసుకున్నారు. ‘మీరు లేకుండా నా జీవితంలో ఒక్క రోజు కూడా పూర్తవ్వదు. జిజు, మోనా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’ అన్నారు. ఫోటోలతో పాటు.. ‘ఈ రోజు నేను ఎలా ఉన్నానో చూడండి.. ఈ రోజు వరకు మీ జ్ఞాపకాలే నన్ను బలంగా నిలబడేలా చేశాయి. మీరున్నప్పుడు ప్రతి రోజు సంతోషంగా మనం ఆడుతూ పాడుతూ ఎలా గడిపామే ఇప్పుడు కూడా అలానే జీవిస్తున్నారును. ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో మీరు నా పక్కనే ఉన్నారనే ఆశతోనే నేను శ్వాసించగల్గుతున్నాను. మీ జ్ఞాపకాలే నా బలం’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు ఆశిష్ చౌదరి. (ఇప్పటికైనా న్యాయం చేయండి: భారత్) View this post on Instagram A post shared by Ashish Chowdhry (@ashishchowdhryofficial) పాకిస్తాన్ నుంచి లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం నుంచి ముంబైకి చేరుకొని అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నరిమన్ హౌస్ యూదు కమ్యూనిటీ సెంటర్ వంటి 12 ప్రముఖ ప్రదేశాల్లో ముష్కరులు ఏకధాటిగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన మారణకాండ సాగింది. -
ఇప్పటికైనా న్యాయం చేయండి: భారత్
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల ఘటనలో న్యాయం చేయాల్సిందిగా భారత్ గురువారం పాకిస్తాన్‌ను కోరింది. ఇటీవల ముంబై ఉగ్రదాడిలో పాల్గొన్న 19 మంది ఉగ్రవాదులను పాకిస్థాన్ మోస్ట్ వాంటెడ్ హై ఫ్రొఫైల్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) చేర్చింది. 2008 నాటి ఉగ్రదాడికి వీరంతా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. వీరంతా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వారే. ముంబై ఉగ్రదాడిలో పాకిస్తానీ టెర్రరిస్టులు పాల్గొన్నారన్నది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ ఉగ్రవాదులకు అండగా ఉంటూ పాకిస్తాన్ వారికి ఆశ్రయం కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.(ముంబై దాడుల దోషి రానా మళ్లీ అరెస్ట్) ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి నవంబర్ 26తో 12 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటికైనా భారత్‌కు న్యాయం చేయాల్సిందిగా పాక్‌ను కోరారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..ఈ దాడిలో భారతీయులే కాక చాలామంది విదేశీ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా దాదాపు 15 దేశాలకు చెందిన 166 మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో పాకిస్తాన్ విఫలమయ్యిందని వ్యాఖ్యానించారు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులైన హఫీజ్ సయీద్, జాకీఉర్ రెహమాన్ లఖ్వీలకు వ్యతిరేకంగా పాక్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని శ్రీ వాస్తవ అన్నారు. ఏఆర్ జడ్ వాటర్ స్పోర్ట్సు కరాచీ నుంచి యమహా మోటారు బోట్ ఇంజిను, లైఫ్ జాకెట్లు, గాలితో కూడిన పడవలను కొనుగోలు చేసేందుకు ఫైనాన్షియర్లు, అల్ హుసేనీ పడవ సిబ్బంది పేర్లను ఎఫ్ఐఏ జాబితాలో చేర్చింది. ఈ మేరకు 880 పేజీలకు పైగా సుదీర్ఘ నివేదిక తయారు చేసింది. 2008 నవంబరు 26న పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, త్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించిన ఘటన తెలిసిందే. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. (రాహుల్ గాంధీకి ఆ పట్దుదల లేదు : ఒబామా) -
‘నీ కోసం భారత్‌లో ఉరి శిక్ష ఎదురుచూస్తోంది’
వాషింగ్టన్: 2008 ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు, పాక్ సంతతి కెనడా వ్యాపారవేత్త తహవుర్ రానాకు.. బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు నిరాకరించింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రానా 1.5 మిలియన్ డాలర్ల బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. 2008 ముంబై కేసులో అతని కోసం భారత్ ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన అమెరికా కోర్టు.. రానాను ఫ్లయిట్ రిస్క్‌గా భావించింది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ చిన్ననాటి స్నేహితుడైన రానాను జూన్ 10న లాస్ ఏంజిల్స్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2008 ముంబై ఉగ్రవాద దాడిలో రానాకు ప్రమేయం ఉన్నందున అతడికి అప్పగించాలంటూ భారతదేశం కోరింది. 2008నాటి ఘటనలో ఆరుగురు అమెరికన్లతో సహా 166 మంది మరణించారు. (ముంబై దాడుల దోషి రానా మళ్లీ అరెస్ట్) లాస్ ఏంజిల్స్ జిల్లా కోర్టు జడ్జి జాక్వెలిన్ చూల్జియన్.. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 21న 24 పేజీల తీర్పునిచ్చారు. పారిపోయే అవకాశం ఉన్నందున రానాకు బెయిల్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ అతన్ని కెనడా వెళ్లేందుకు అనుమతిస్తే.. అప్పుడు రానా భారత్‌లో శిక్షను తప్పించుకుంటాడని కోర్టు అభిప్రాయపడింది. భారీ మొత్తంపై బెయిల్ ఇచ్చినా.. కోర్టుకు తీసుకువచ్చే గ్యారెంటీ ఉండదని కోర్టు తెలిపింది. అతడి కోసం భారతదేశంలో ఉరి శిక్ష ఎదురు చూస్తుందని.. ఇప్పుడు రానాకు బెయిల్ మంజూరు చేస్తే.. అతడు పారిపోయే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాక రానాకు బెయిల్ మంజూరు చేయడం వల్ల అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని అసిస్టెంట్ యుఎస్ అటార్నీ జాన్ జె లులేజియన్ కోర్టుకు తెలిపారు. అయితే రానా వల్ల ఎటువంటి రిస్క్ లేదని, ఆయనపై 1.5 మిలియన్ల డాలర్ల పూచీకత్తు పెడుతున్నామని కోర్టులో అతని తరఫున న్యాయవాది వాదించారు. ('ఆ ఘటన మరిచిపోలేనిది, క్షమించరానిది') రానాపై భారత్‌లో హత్య అభియోగం కింద కేసులు ఉన్నాయి. లష్కరే తోయిబాకు ఆర్థిక సహాకారం అందిస్తున్న కేసులో.. 2011లో షికాగో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వాస్తవానికి అమెరికాలో రానాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు అతన్ని భారత్‌కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డేవిడ్ కోల్మన్ హెడ్లీ సహకారంతో రానా అమెరికాలో ఉగ్రవాదులకు సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ముంబై పేలుళ్ల కేసులో హెడ్లీ కూడా దోషిగా ఉన్నాడు. -
ఉగ్ర సయీద్‌కు ఊరట
లాహోర్: ముంబై ఉగ్ర పేలుళ్ల ప్రధాన సూత్రదారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జేయూడీ (జమాత్–ఉద్–దవా) చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్‌లోని యాంటీ టెర్రరిజమ్ కోర్టులో (ఏటీసీ) ఆశ్చర్యకర రీతిలో స్వల్ప ఊరట లభించింది. ఉగ్ర నిరోధక కేసులో హఫీజ్‌తో పాటు మరో నిందితుడిగా ఉన్న మాలిక్ జాఫర్ ఇక్బాల్‌ను అధికారులు విచారణకు హాజరుపర్చకపోవడం పట్ల కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇక్బాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టని కారణంగా హఫీజ్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణలో భాగంగా ఈ నెల 11న అతడిపై అభియోగాలు నమోదు చేస్తామని శనివారం తెలిపింది. 11న ఇక్బాల్‌ను కోర్టు ఎదుట హాజరుపర్చాలని అధికారులను ఆదేశించింది. -
కొత్తనీతి.. సరికొత్త రీతి
నోయిడా: బాలాకోట్ ఉగ్రదాడిపై ఆధారాలు చూపాలంటున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉగ్రమూకల ఏరివేత విషయంలో యూపీఏ ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయిందని విమర్శించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం 2016లో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రమూకలకు వారికి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం చెప్పిందని వ్యాఖ్యానించారు. భారత్ ఇప్పుడు ‘కొత్తనీతి–సరికొత్త రీతి’తో ముందుకుపోతోందన్నారు. ‘2008లో జరిగిన ముంబై మారణహోమాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ ఉగ్రదాడులకు భారత్ వెంటనే ప్రతిస్పందించి ఉంటే ప్రపంచం మొత్తం మనకు అండగా నిలిచేది. పాక్‌లో ఉగ్రసంస్థల పాత్రపై మనదగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయింది. ఉగ్రదుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మన భద్రతాబలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం మౌనం వహించింది’ అని అన్నారు. తెల్లవారుజామునే పాకిస్తాన్ ఏడ్చింది.. పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 24న దాడిచేశాక తెల్లవారుజామున 5 గంటలకు ‘మోదీ మాపై దాడి చేశాడు’ అని పాక్ ఏడుపు అందుకుంది. దాడులతో ఇబ్బందిపెడుతూనే ఉండొచ్చనీ, ఇండియా ప్రతిస్పందించదని వాళ్లు భావిస్తున్నారు. 2014కు ముందున్న రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం కారణంగానే శత్రువులకు ఈ అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఉడీ ఘటన తర్వాత మన బలగాలు ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి వాళ్లను హతమార్చాయి. యూపీలోని కుర్జాలో, బిహార్‌లోని బుక్సారిన్‌లో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 50ఏళ్ల పాత సామగ్రిని వాడటంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10కు చేరుకుందని ప్రధాని తెలిపారు. కానీ సౌరశక్తి ద్వారా ఇప్పుడు యూనిట్ విద్యుత్‌ను రూ.2కే ఉత్పత్తి చేయొచ్చన్నారు. ఐదేళ్లలో మూడు దాడులు: రాజ్‌నాథ్ మంగళూరు: గత ఐదేళ్లలో భారత్ మూడు సార్లు దాడులు చేసిందని హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. 2016లో ఉడి ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన దాడి, ఇటీవల జరిపిన వైమానిక దాడుల గురించి వివరించిన రాజ్‌నాథ్ మూడో దాడి వివరాలు బయటపెట్టలేదు. శనివారం కర్ణాటక బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉడిలో నిద్రపోతున్న సైనికులపై ఉగ్రవాదులు దాడి జరిపి 17 మందిని చంపివేశారని, దీనికి ప్రతీకారంగా పీవోకే భారత్ తొలి మెరుపుదాడి చేసిందన్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత వైమానిక దాడి జరిపి జైషే ఉగ్ర శిబిరాన్ని నాశనం చేసిందన్నారు. ఈ దాడులతో భారత్ బలహీన దేశం కాదని పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చామని వెల్లడించారు. -
‘అమితాబ్ కోసం వస్తే 26/11 దాడుల్లో ఇరికించారు’
ముంబై : ‘నేను అమితాబ్ బచ్చన్‌కి పెద్ద ఫ్యాన్‌ని.. ఆయన బంగ్లా చూడటానికి ఇండియా వచ్చాను. కానీ ‘రా’ అధికారులు నా పాస్ పోర్ట్ లాక్కుని నన్ను అరెస్ట్ చేశారు’.. ఇవి కరుడు కట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ కోర్టు ముందు చెప్పిన కట్టుకథ. ముంబై 26/11 ఉగ్ర దాడులు జరిగి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. కానీ ఈ దాడి తాలుకా గాయం నేటికి పచ్చిగానే ఉంది. దాదాపు 166 మంది అమాయకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. యావత్ దేశాన్ని భయకంపితం చేసిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. అయితే వీరిలో అజ్మల్ కసబ్ మాత్రమే ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు. ఉగ్రదాడుల తరువాత జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు కసబ్‌ని విచారించిన నాటి పోలీసు అధికారి రమేష్ మహలే. ముంబై 26/11 దాడుల కేస్ విచారణాధికారిగా నియమితులయ్యారు మహలే. అప్పటి విషయాలను తల్చుకుంటూ.. ‘కసబ్ చాలా తెలివిగలవాడు. పోలీసులను బురిడి కొట్టి తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ దాడికి సంబంధించిన వివరాలు సేకరించడానికి మాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే అబద్దాలు చెప్పడం కసబ్ ప్రవృత్తి. కానీ నేర విచారణ విభాగంలో నాది దాదాపు 25 ఏళ్ల అనుభవం. నేను రాకేష్ మరియా, దేవెన్ భార్తి వంటి అనుభవజ్ఞులైన అధికారులతో కలిసి పని చేశాను. ఆ అనుభవం నాకు 26/11 కేసు విచారణ సమయంలో బాగా ఉపయోగపడిందంటూ చెప్పుకొచ్చారు మహలే. ‘పోలీసుల ముందు తన నేరాన్ని ఒప్పుకోవడానికి ముందు కసబ్ పలు అసాధరణమైన అబద్దాలు చెప్పాడు. విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చాక అతడి అబద్దాలు మరింత ముదిరాయి. కోర్టులో ఏకంగా అమితాబ్ బచ్చన్ పేరును వెల్లడించాడు. తాను అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానినని తెలిపాడు. కేవలం బిగ్‌బీ నివాసం చూడటం కోసమే తాను ఇండియా వచ్చానని.. కానీ రా అధికారులు తన మీద తప్పుడు కేసు నమోదు చేశారంటూ కసబ్ కోర్టులో ఆరోపించాడు. రా అధికారులు తన దగ్గరకు వచ్చి తన పాస్‌పోర్టును లాక్కుని.. చించివేశారని.. తరువాత తనను 26/11 దాడులు జరిగిన ప్రాంతానికి తీసుకొచ్చారని తెలిపాడు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారంటూ’ కసబ్ వాదించాడని మహలే గుర్తు చేసుకున్నారు. ‘అయితే కసబ్ చెప్పేవన్ని అబద్దాలే. వాటన్నింటికి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఏకే 47 తుపాకీ పట్టుకుని ఛత్రపతి శివాజీ టర్మినల్ దగ్గర నిల్చున్న కసబ్ ఫోటో అక్కడ ఉన్న సీసీటీవీలతో పాటు.. జర్నలిస్ట్‌ల దగ్గర కూడా ఉంది. దాంతో కసబ్ వాదనలు ఏ కోర్టులో నిలవలేదు. ఆ తరువాత నెమ్మదిగా కసబ్ ఈ దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించడం ప్రారంభించాడు. కసబ్‌ని 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది. ‘అల్లా కసమ్, ఐసి గల్తీ దొబార నహీ హోగీ’.. ‘అల్లా మీద ప్రమాణం. ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను’ ఉరితీసే ముందు అజ్మల్ కసబ్ చివరి మాటలివి. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి 2008 నవంబరు 26న లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. -
‘అసలైన ఘనత ఇమ్రాన్‌కే చెందుతుంది’
చండీగఢ్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక చొరవ వల్లే కర్తార్‌పూర్ కారిడార్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు వ్యాఖ్యానించారు. సిక్కుల ప్రార్థనలు ఫలించేలా చేసిన ఘనత కేవలం ఇమ్రాన్‌కే చెందుతుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సిద్ధు.. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఈ నిర్మాణం విషయంలో అసలైన ఘనత మాత్రం పాక్ ప్రధాని, తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. 24 ఏళ్ల కఠోర శ్రమ అనంతరం ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్ సిక్కు ప్రజల ఆకాంక్షలు ఫలించేలా చేశారని ప్రశంసించారు. రాజకీయాలను, మతాన్ని వేర్వేరుగా చూసినపుడే అందరూ సంతోషంగా ఉంటారని ఈ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. (భారత్ ఇక ఆ విషయాన్ని మర్చిపోవాల్సిందే : పాక్) కాగా వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలవడం సిద్ధుకు కొత్తేం కాదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన సమయంలో, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం.. సౌత్ ఇండియా కంటే పాకిస్తానే బెటర్ అంటూ వ్యాఖ్యానించడం తదితర సమయాల్లో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే లష్కరే ఉగ్రవాదులు ముంబైలో సృష్టించిన నరమేధానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ ఘటనలో మరణించిన వారికి, అమరవీరులకు దేశమంతా నివాళి అర్పిస్తుంటే... అందుకు కారణమైన దాయాది దేశాన్ని ప్రశంసల్లో ముంచెత్తడం సిద్ధుకే చెల్లిందని ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. (26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం) -
క్షమాపణ చెప్పకుంటే రూ. 5 కోట్లు కట్టండి
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పాక్ రక్షణమంత్రి దస్తగీర్‌కు రూ.5.70 కోట్ల(10 కోట్ల పాకిస్తానీ రూపాయలు) పరువునష్టం నోటీసులిచ్చాడు. ‘పాఠశాల విద్యార్థులపై ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరపకుండా ఉండేందుకే జేయూడీ, ఎఫ్ఐఎఫ్లకు విరాళాలపై నిషేధం విధిస్తున్నాం’ అని ఇటీవల దస్తగీర్ అన్నారు. దీంతో ‘ఈ విషయమై నా క్లయింట్(సయీద్)కు 14 రోజుల్లోగా రాతపూర్వకంగా క్షమాపణ చెపాల్పి. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని దస్తగీర్ మాటివ్వాలి. లేదంటే పాకిస్తాన్ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద కోర్టును ఆశ్రయిస్తాం’ అని సయీద్ న్యాయవాది నోటీసులు జారీచేశారు. -
ఎన్నికల బరిలో హఫీజ్.. ప్రమాదంలో ప్రపంచం
ఇస్లామాబాద్ : సమాతే ఉద్ దవా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ 2018 సాధారణ ఎన్నికల్లు పోటీ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్.. ఈ మధ్యే గృహనిర్భంధం నుంచి విడుదలయ్యారు. హఫీజ్ సయీద్ ఇప్పటికే పాకిస్తాన్లో మిల్లీ ముస్లిం లీగ్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పాకిస్తాన్ ఎన్నికల సంఘం దానిని అధికారికంగా గుర్తించలేదు. ఎన్నికల సంఘం పార్టీని గుర్తించకపోయినా.. ఎంఎంఎల్ పార్టీ అభ్యర్థిగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని హఫీజ్ సయీద్ చెప్పారు. పాకిస్తాన్‌ను నిజమైన ముస్లిం సంక్షేమ రాజ్యంగా మలిచే శక్తి ఒక్క హఫీజ్ సయీద్‌కు మాత్రమే ఉందని ప్రముఖ మత బోధకుడు సైఫుల్లా ఖలీద్ అన్నారు. దేశంలోని ఇతర రాజకీయ నేతలతో పోలిస్తే.. హఫీజ్ సయీద్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఆచన చెప్పారు. -
'ఆప్' నేతకు తాజ్ ఆహ్వానం
ముంబై: ఎన్ఎస్జీ మాజీ కమాండో, ఆప్ నేత సురేందర్ సింగ్ ను ముంబైలోని తాజ్ హోటల్ యాజమాన్యం విందుకు ఆహ్వానించింది. 26/11 ముంబై దాడుల సందర్భంగా సురేందర్ వీరోచితంగా పోరాడి ఇద్దరు ముష్కరులను హతమర్చారని, అందుకే ఆయను ఇలా గౌరవించాలనుకున్నామని తాజ్ ప్రతినిధి రఘు రామ్ తెలిపారు. ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడంలో అత్యంత సాహసం ప్రదర్శించిన సురేందర్ ను గౌరవించడం సంతోషంగా ఉందని రఘు రామ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్ షేర్ చేశారు. 26/11 దాడిలో అసువులు బాసిన వారికి గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముంబైలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాజ్ హోటల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 2008లో ముష్కరులు తాజ్ హోటల్ పై దాడి చేసినపుడు ఎన్ఎస్జీ కమాండో గా విధుల్లో ఉన్న సురేందర్, అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. దాదాపు పది మంది పాకిస్తాన్ జీహాదీలు ముంబై నగరంలో బాంబులతో దాడిచేసి, విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడడంతో 166 మంది చనిపోగా వందల సంఖ్యలో గాయపడ్డారు. 26 నవంబర్ నుండి 29 నవంబర్ వరకూ మూడు రోజుల పాటు ముష్కర మారణకాండ కొనసాగింది. -
భారత్‌కు మరో 26/11 ముప్పు పొంచి ఉందా?
భారత ఉపఖండంలో అల్ కాయిదా కొత్త శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు అల్ జవహరి ప్రకటించడం సరికొత్త ప్రమాదాలకు తావిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ సాయంతో తన సొంత ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే భారతదేశానికి మరో 26/11 దాడి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు అంటున్నాయి. అల్ కాయిదా విషయంలో అమెరికా పెద్దగా స్పందించలేదు గానీ, భారతదేశం మాత్రం వెంటనే అప్రమత్తమైంది. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర నిఘా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ప్రధాని నరేంద్రమోడీకి కూడా భారతదేశం మీద మరో ముంబై తరహా దాడి జరగొచ్చన్న సమాచారం పక్కాగా వచ్చినట్లు తెలిసింది. దాంతో దేశవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సేనలు ఈ ఏడాది చివరికల్లా వెళ్లిపోతాయి కాబట్టి, ఆ దేశం పెద్దగా అల్ కాయిదా గురించి పట్టించుకోవట్లేదు గానీ.. భారత్ మాత్రం అంత తేలిగ్గా తీసి పారేసే పరిస్థితి లేదు. ముంబై అనుభవం మన దేశ భద్రతా వ్యవస్థలోని లోపాల గురించి సమీక్షించుకోడానికి ఓ అవకాశం కల్పించింది. మన దేశం ఉగ్రవాద దాడులకు అత్యంత అనుకూలమని భద్రతా రంగ నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇక్కడ పెరుగుతున్న జనసాంద్రత, నిఘావ్యవస్థలో లోపాలు, అడుగడుగునా అవినీతి, పోలీసు శాఖ అసమర్థత.. వీటన్నింటి ఫలితంగా ఉగ్రవాద దాడుల ముప్పు మనకు చాలా ఎక్కువ అని అంటున్నారు. అందుకే రాబోయే ఏడాది నుంచి రెండేళ్ల మధ్య కాలంలో మరో 26/11 తరహా దాడి జరిగే ప్రమాదం లేకపోలేదని గట్టిగా అంటున్నారు. ఆనాటి దాడిలో కూడా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి చేసిందేనన్న వాదన ఉంది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పలు జీహాదీ గ్రూపులు బయల్దేరడంతో తన ఉనికిని చాటుకోడానికి లష్కర్ ఈ దాడి చేసిందంటున్నారు. ఇప్పుడు అల్ కాయిదా కూడా పెద్దగా ఉనికిలో లేదు. ఇప్పుడు సైతం ప్రపంచవ్యాప్తంగా పలు జీహాదీ సంస్థలు రావడంతో ఈ సంస్థ తన ఉనికిని చాటుకోడానికి, ఆధిపత్యం నిరూపించుకోడానికి ఓ ప్రయత్నం తప్పకుండా చేస్తుందని, అందుకు లక్ష్యం కూడా భారతదేశమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
మరో 'ముంబై ముట్టడి' ఉండచ్చేమో!!
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం మీద 2008లో జరిగిన ఉగ్రదాడి తర్వాత తీరప్రాంత రక్షణను గణనీయంగా బలోపేతం చేసినట్లు కోస్ట్‌గార్డ్ చీఫ్ ఏజీ తప్లియాల్ తెలిపారు. అయితే.. సముద్రమార్గంలో అలాంటి దాడి మరోటి జరిగే అవకాశాలు మాత్రం లేకపోలేవన్నారు. తాము ఒకలా ఆలోచిస్తే ఉగ్రవాదులు మరోలా ఆలోచించి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ముంబై తీరానికి చేరుకోడానికి ఉగ్రవాదులు డింగీ అనే చిన్న బోటును ఉపయోగించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు.. 20 మీటర్ల కన్నా చిన్న పరిమాణంలో ఉండే బోట్లను కూడా గుర్తించే పరిజ్ఞానాన్ని తాము పెంపొందించుకుంటున్నామన్నారు. మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసి, చిన్న బోట్లను గుర్తించేలా తయారుచేస్తున్నామన్నారు. -
ముంబైపై ముష్కరుల దాడికి ఐదేళ్లు చెదిరిన జ్ఞాపకాలు
ముంబై: పాకిస్థాన్‌కు చెందిన పదిమంది ఉగ్రవాదులు నగరంపై విరుచుకుపడి అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఘటన చోటుచేసుకుని మరో రెండు రోజుల్లో ఐదేళ్లు కానుంది. ఈ దాడులు దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. అయితే ఆనాటి ఈ పీడకల నగరవాసుల జ్ఞాపకాలనుంచి దాదాపు చెదిరిపోయింది. ఏడాదికొకసారి మృతుల స్మారకార్థం కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, వాటిని ప్రసా ర మాధ్యమాలు ప్రజలకు చేరవేయడం జరుగుతోందే తప్ప నగరవాసులు మాత్రం తమ తమ దైనందిన కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమైపోయారు. ఆనాటి దాడి ఘట నలో మొత్తం 166 మంది చనిపోగా. మరో 300 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 26 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈ నెల 26వ తేదీ (దాడి జరిగిన రోజు) సమీపిస్తుండడంతో ఆనాటి పీడకల మరికొందరి మదిలో మిణుకుమిణుకుమంది. ఈ విషయమై విలేపార్లే ప్రాంతంలో నివసించే సాఫ్ట్వేర్ కన ్సల్టెంట్ దుకుల్ పాండ్యా మాట్లాడుతూ ఆనాటి ఘటన అత్యంత విచారకరమన్నారు. అసలు ఆవిధంగా జరిగి ఉండాల్సింది కాదన్నారు. ఏదిఏమైనప్పటికీ నగరవాసులంతా గతం మరిచిపోయి భవిష్యత్తుపై దృష్టి సారించి ముందుకు సాగాలని ఆ రాత్రంతా మెలకువతో ఉండి టీవీలో వస్తున్న దృశ్యాలను తిలకిస్తూ కాలం గడిపిన పాండ్యా పేర్కొన్నాడు. ఇదే విషయమై బోరివలికి చెందిన కె.ఎస్.మీనాక్షి మాట్లాడుతూ అదొక జాతీయ విషాదమన్నారు. దీని సంగతి అలాఉంచితే ద్రవ్యోల్బణం ప్రభావంతో ధరల పెరుగుతుండడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున ్న సమస్యలతోపాటు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు నగరవాసులు అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. 26/11 వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఐదు సంవత్సరాల క్రితం పాకిస్థాన్‌కు చెందిన పది మంది సాయుధ ఉగ్రవాదులు అరేబియా సముద్రమార్గం మీదుగా నగరంలోకి చొరబడ్డారు. అంతకుముందు పాకిస్థాన్ సముద్ర తీరాన్ని దాటివచ్చిన వీరంతా నవంబర్ 26వ తేదీ సాయంత్రం ప్రశాంతంగా దేశరాజధానిలోకి అమాయకుల మాదిరిగా అడుగుపెట్టారు. కొలాబా తీరాన దిగిన వీరంతా ఒక క్రమపద్ధతితో రెండు మూడు బృందాలుగా విడిపోయి తమ తమ లక్ష్యాల దిశగా అడుగులు వేశారు. వీరిలో అబ్దుల్ రెహమాన్, అబూ అలీ, అబూ సోహెబ్‌లు కొలాబాలోని లియోపోల్డ్ కేఫ్ వైపు వెళ్లారు. ఆ తర్వాత తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ దిశగా ముందుకు సాగారు. అబ్దుల్ రెహమాన్ చోటా, ఫహదుల్లాలు ట్రైడెంట్ ఒబెరాయ్ వైపు, నాసిర్ అబూ ఉమర్, బాబర్ ఇమ్రాన్ అలియాస్ అబూ ఆకాశలు నారిమాన్ హౌస్ వైపు, ఇస్మాయిల్ ఖాన్, అబూ ఇస్మాయిల్, అజ్మల్ ఆమిర్ కసబ్‌లు తొలుత నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ టెర్మినస్వైపు, ఆ తర్వాత కామా ఆస్పత్రి దిశగా ముందుకుసాగారు. వీరు ఎంచుకున్న లక్ష్యాలన్నీ అత్యంత ఇరుకైన దక్షిణ ముంబైలో కేవలం ఐదుకిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. అక్కడ బ్యూరోక్రాట్లు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు నివసిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికార నివాసాలు, మంత్రుల నివాసాలు కూడా అక్కడే ఉన్నాయి. ఉగ్రవాదులు నగరంలో విధ్వంసకాండకు దిగినట్టు సమాచారం అందిన తర్వాత రంగంలోకి దిగిన నగర పోలీసులు, సైనిక బలగాలు, నౌకాదళ కమాండోలు, ఇతర పారామిలిటరీ బల గాలు 50 గంటల సుదీర్ఘ పోరాటం జరిపి 22 ఏళ్ల కసబ్ మినహా మిగతా వారందరినీ హతమార్చాయి. ఇక నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున గిర్గావ్ చౌపాటీ వద్ద పోలీసులు అజ్మల్ ఆమిర్ కసబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్, హోటల్ ట్రైడెంట్, నారిమాన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆస్పత్రి, వాడిబందర్ తదితర ప్రాంతాల్లో సంచరించిన ఈ ఉగ్రవాద బృందం నర మేధానికి పాల్పడింది. అమాయకుల ప్రాణాలను బలిగొంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే విలేపార్లే ప్రాంతంలో తాము ఎక్కిన కారును బాంబులతో పేల్చివేసింది. సజీవంగా దొరికిపోయిన క సబ్‌ను పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారించారు. ఈ విచారణలో దాడులకు ప్రత్యక్ష, పరోక్ష కారకులైన 35 మంది పేర్లను కసబ్ పోలీసులకు వెల్లడించాడు. ఈ కేసుపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం తన వాదనలను సమర్థంగా వినిపించారు. దీంతో కసబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ దిగువకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కసబ్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ సవాలుచేశాడు. రెండుచోట్లా చుక్కెదురైంది. తనకు క్షమాబిక్ష పెట్టాలంటూ కసబ్ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. దానిని కూడా రాష్ర్టపతి తిరస్కరించడంతో పుణేలోని ఎరవాడ కేంద్ర కారాగారంలో గత ఏడాది నవంబర్ 21వ తేదీన కసబ్‌ను ఉరితీసిన సంగతి విదితమే. -
24న సాక్షుల విచారణ
ముంబై : నగరంలో 2008 నవంబర్ 26వ తేదీన జరిగిన తీవ్రవాదుల దాడి కేసుకు సంబంధించి భారత్‌లోని సాక్షులను 8 మంది సభ్యులుగల పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ ఈ నెల 24న విచారించనుంది. సాక్ష్యాలను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి పి.వై.లడేకర్ నమోదు చేయనున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ఘటనలో పట్టుబడిన పాక్ తీవ్రవాది అజ్మల్కసబ్ వాంగ్మూలాన్ని నమోదుచేసిన నగర న్యాయమూర్తి, కేసులో ముఖ్య నేరపరిశోధన అధికారి రమేష్ మెహలే, సెక్యూరిటీ దళాల చేతిలో హతులైన 9 మంది పాక్ తీవ్రవాదుల పోస్టుమార్టం నిర్వహించిన ఇద్దరు డాక్టర్లు పాక్ జ్యుడీషియల్ కమిషన్ ముందు సాక్ష్యం చెప్పనున్నారు. కమిషన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. మొదటిసారి 2012 మార్చిలో కమిషన్ భారత్‌ను సందర్శించింది. అయితే అప్పుడు సాక్షులను విచారించేందుకు కమిషన్‌కు భారత్ అనుమతి ఇవ్వకపోవడంతో అప్పటి నివేదికను పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు వస్తున్న కమిషన్‌లో నూతన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తోపాటు పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు సంబంధించిన ఇద్దరు అధికారులు ఉన్నారు. కమిషన్ సభ్యులకు వారం పాటు పనిచేసే వీసాను బుధవారం ఇచ్చార ని, వీరు వాఘా సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తారని అధికారులు తెలిపారు. ఈ కేసులో భారత్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నిఖమ్ వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఉజ్వల్ నిఖమ్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఈ కేసుకు సంబంధించిన సాక్షులను విచారించేందుకు భారత్ తిరస్కరించందన్నారు. అయితే ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భారత్ సాక్షులను విచారించేందుకు పాక్ కమిషన్ సభ్యులు వస్తున్నారని చెప్పారు. ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ఏడుగురు నిందితులపై విచారణ జరుగుతోంది. ఇందులో లష్కరే-ఇ-తోయిబా కమాండర్ జాకీర్ రెహ్మాన్ లక్వీ కూడా ఉన్న సంగతి విదితమే. ఈ కేసు విచారణ భారత్‌లో విచారణ పూర్తయ్యింది. నిందితుడు అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష విధించి అమలు చేసింది కూడా. అయితే పాక్‌లో మాత్రం కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసును వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా రెండు దేశాలమధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల నిఖమ్తో పాటు భారత్ ప్రతినిధి బృందం పాకిస్థాన్‌ను సందర్శించి అక్కడి అధికారులతో సమీక్షించారు. అప్పటి ఒప్పందం మేరకు పాక్ జ్యుడీషియల్ కమిషన్ సభ్యులకు భారత్ సాక్షులను విచారించేందుకు అంగీకరించారు. కాగా గత పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఉగ్రవాదులు హతమార్చిన క్రమంలో కమిషన్ భారత్ పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటివరకు పాక్ కమిషన్ సభ్యుల పర్యటన వివిధ కారణాల వల్ల మూడుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 24న సభ్యులు భారత్‌ను సందర్శించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.